బాహుబలి సిరీస్ తరువాత తెలుగు సినిమాల్లో రంగస్థలం రేంజ్ హిట్ లేదు. అది పక్కా వాస్తవం. బాహుబలి సిరీస్ తరువాత ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమా అదే. కలెక్షన్లు వసూలు చేసిన సినిమా అదే. యాభైరోజుల సెంటర్లు, వంద రోజులు సెంటర్లు చాలా రికార్డులు స్వంతం చేసుకుంది. వీటన్నింకన్నా రేర్ రికార్డ్ ఏమిటంటే, విజయవాడ (అప్సర), రాజమండ్రి (శ్యామల) సెంటర్లలో వందరోజులు ఒక రూపాయి డెఫిసిట్ లేకుండా ఆడడం.
సాధారణంగా ఓ రేంజ్ కు వచ్చిన తరువాత అంటే యాభైరోజులు దగ్గరకు వచ్చాక, లేదా వందరోజులు దగ్గరకు వచ్చాక చిన్న డెఫిసట్ అనేది కామన్. అభిమానులు లేదా, అంతవరకు లాభాలు తిన్న డిస్ట్రిబ్యూటర్ ఆ మాత్రం ఢెఫిసిట్ భరించి, యాభైరోజలు లేదా వందరోజుల రన్ కు కోపరేట్ చేస్తారు. ఖైదీ నెంబర్ 150కి చాలా సెంటర్లలో ఇలా చేసారని టాక్ వుంది.
కానీ రంగస్థలం విజయవాడ, రాజమండ్రి సెంటర్లలో చివరి వరకు ఒక్కరూపాయి డెఫిసిట్ లేకుండా నడిచిందట. క్రాస్ రోడ్స్ లో కూడా దాదాపు ఇదే రికార్డు వచ్చిందట. రంగస్థలం సినిమా బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు ఏరియాల వారీ థియేటర్ల వారీ బయ్యర్లకు అత్యద్భుతంగా లాభాలు పండించి, వందరోజులు ఆడిన సందర్భంగా ఈనెల 8న ఫంక్షన్ కూడా చేస్తున్నారు.