Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

హాట్ హాట్.. దిశా ప‌టానీ!

హాట్ హాట్.. దిశా ప‌టానీ!

బాలీవుడ్ లో ప్ర‌స్తుతం డిమాండ్ ఉన్న హీరోయిన్ల‌లో ఒక‌రైన దిశా ప‌టానీ .. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై ఫైర్ ను సెట్ చేస్తోంది! ఇన్ స్టాగ్ర‌మ్ వేదిక‌గా త‌న అందాల ఫొటోల‌ను పోస్టు చేయ‌డంలో ఈమెది అందె వేసిన చేయి. ఈ సోష‌ల్ మీడియా సైట్ లో ఫాలోయ‌ర్ల విష‌యంలో దిశా కు మిగ‌తా యంగ్ స్టార్ హీరోయిన్లు కూడా పూర్తి పోటీ ఇవ్వ‌లేక‌పోతున్నారు!

ఇన్ స్టాలో అటు ఇటుగా ఐదు కోట్ల మంది ఫాలోయ‌ర్లున్నారు దిశా ప‌టానీకి! మ‌రి వారి కోసం ఎప్ప‌టికిప్పుడు త‌న పిక్స్ ను పోస్టు చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో ఈ హాట్ పిక్ ను పోస్టు చేసింది ఈ న‌టీమ‌ణి. హాట్ నెస్ కునిర్వ‌చ‌నం ఇచ్చేంత రీతిలో ఫొటో దిగి నెట్ లోకి వ‌దిలింది ఈ హీరోయిన్.

ఎప్ప‌టిక‌ప్పుడు న‌వ్య‌నూత‌న‌మైన రీతిలో త‌న‌లోని హాట్ నెస్ ను ఆవిష్క‌రిస్తున్న దిశ‌.. ఎప్పటిక‌ప్పుడు అందుకు త‌గ్గ స్థాయిలో లైక్ ల‌ను పొందుతూనే ఉంది. దిశా ప‌టానీ అధికారిక  ఇన్ స్టా అకౌంట్ లోనో ఈ పొటోకు తొలి గంట‌లోనే ప‌ది ల‌క్ష‌ల ల‌వ్స్ ప‌డ్డాయి! ఇక ఈమె ఫ్యాన్ పేజీల కౌంట్ వేరే! ఇలా త‌న ఫాలోయింగ్ రేంజ్ ను దిశా ప‌టానీ ఏ రోజుకారోజు నిరూపించుకుంటూనే ఉంది.

ఇక కెరీర్ విష‌యానికి వ‌స్తే.. ఇది వ‌ర‌కే తెలుగులో ఒక సినిమా చేసిన దిశా పై ఇప్పుడు మ‌ళ్లీ టాలీవుడ్ స్టార్ హీరోల చూపు ప‌డిన‌ట్టుగా ఉంది. భారీ పారితోషికం ఇచ్చి అయినా స‌రే, ఈమెను త‌మ సినిమాలో న‌టింప‌జేసుకోవ‌డానికి తెలుగు స్టార్ హీరోలు ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టుగా స‌మాచారం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?