cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: నూటొక్క జిల్లాల అందగాడు

మూవీ రివ్యూ: నూటొక్క జిల్లాల అందగాడు

మూవీ: నూటొక్క జిల్లాల అందగాడు
రేటింగ్: 2/5
బ్యానర్: ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్
తారాగణం: అవసరాల శ్రీనివాస్, రుహాని శర్మ, రోహిణి తదితరులు
రచన: అవసరాల శ్రీనివాస్
కెమెరా: రాం
సంగీతం: శక్తి కాంత్ కార్తిక్
ఎడిటర్: కిరణ్ గంటి
నిర్మాతలు: శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్
విడుదల తేదీ: 3 సెప్టెంబర్, 2021

జీయస్సెన్ అనబడే గొట్టి సూర్యనారయణ (అవసరాల శ్రీనివాస్) ఒక రియలెస్టేట్ కంపెనీలో సీనియర్ పొజిషన్లో పనిచేస్తుంటాడు. బట్టతల అతనికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి. దాని వల్ల కలిగే సిగ్గుని విగ్గుతో కవర్ చేసుకుంటుంటాడు. 

అంజలి (రుహాని శర్మ) ఆ ఆఫీసులో జాయినవుతుంది. ఆమెకు హీరోతో మొదలైన ఫ్రెండ్షిప్ త్వరగానే ప్రేమగా మారుతుంది. ఇతని బట్టతల విషయం తెలియక ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ ఒక రోజు విగ్గు లేకుండా ఉన్న హీరోని చూసి హీరోయిన్ ఖంగు తింటుంది. 

ఆ తర్వాత ఏమయ్యిందనేదే తక్కిన కథ. ఇలాటి బట్టతల కథలు హిందీలో "బాల", "ఉడ్తా చమన్" పేరుతో వచ్చాయి. ఈ నూటక్క జిల్లాల అందగాడు ఇంచుమించు "బాల" లైన్లోనే నడుస్తుంది. 

పెట్టిన టైటిల్ కి, చేసిన ప్రచారానికి ఇదొక పెద్ద హాస్యప్రథాన చిత్రం అనుకోవడం సహజం. అవసరాల మార్కు కామెడీతో ఆరంభం బాగానే ఉంది. బట్టతల కథ మొదలుపెట్టిన తీరు బాగుంది. అలాగే హీరోయిన్ కి తెలుగు రాదనుకుని హీరో ఆమె గురించి తెలుగులో మాట్లాడే సీన్ కాసేపు నవ్విస్తుంది. కానీ అనుకున్నంత హాస్యం తరవాత లేకపోవడం ఒక మైనస్. దానికి కారణం నెత్తి మీద సరిపడా వెంట్రుకలు లేనట్టుగానే సినిమాగా మలచడానికి సరిపడా కథ లేకపోవడమే. 

పాయింటుని నమ్ముకుని కథ మీద కసరత్తు చేయకుండా సినిమా మొదలుపెట్టేస్తే ఇలాగే ఉంటుంది. ఇంటెర్వల్ నుంచి కథని ఎక్సైటింగ్ గా ఎలా నడపాలో తెలియలేదు దర్శకుడికి, కథకుడికి. నవ్వులు ఆగిపోయి ఎప్పుడు శుభం కార్డు పడుతుందా అని వాచీలు చూసుకోవడమే సరిపోతుంది. 

సత్తిపండు పాత్ర చుట్టూ పెంచిన హైప్ ఏమో గానీ, ఆ పాత్ర తెర మీదకు రాగానే డ్రామా చల్లబడిపోయింది. అందరూ భయపడినట్టుగానే చివర్లో హీరో బట్టతల గురించి లెక్చరిస్తూ "అందమే ఆనందం కాదు, ఆనందమే అందం" లాంటి వ్యక్తిత్వవికాస సూత్రలు చెబుతాడు.

సెకండాఫ్ పూర్తిగ తిరగ రాసుకునుంటే బాగుండేది. ఏ సినిమాకైనా సెకండాఫ్, క్లైమాక్స్ ఆయువుపట్లు. అవి ఖచ్చితంగా ఫస్టాఫ్ కంటే ఎంతో బాగుండాలి. అప్పుడే సినిమా హిట్టు. 

అవసరాల శ్రీనివాస్, రుహాని చక్కని నటనాప్రతిభ చూపించారు. కమెడీ డోసు ఇంకా పెంచుంటే మరింత ఆకట్టుకునే వారు. తల్లిగా రోహిణి బాగా చేసింది. మ్యూజిక్ అంత క్యాచీగా లేదు. కెమెరా పనితనం బాగుంది.

సినిమా హాల్లో కన్నా ఇంట్లో తీరుబడిగా ఓటీటీలో చూడదగ్గ సినిమా ఇది. 

బాటం లైన్: "కొంచెం అచ్ఛా- మిగతాది బహుత్ భారం"

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×