అక్కడ కత్తి యుద్ధం నేర్పబడును…

కత్తులు కటార్లు అన్నవి రాజుల కాలం నాటి ముచ్చట్లు. వెనకటి రోజులల్లో రాజుల కోట నిండా అవే ఆయుధాలుగా ఉండేవి. శత్రువుల పీచమణచడానికి వాటిని పెద్ద ఎత్తున వాడేవారు. కత్తితో ప్రత్యర్ధుల కుత్తులకు కోసేవారు.…

కత్తులు కటార్లు అన్నవి రాజుల కాలం నాటి ముచ్చట్లు. వెనకటి రోజులల్లో రాజుల కోట నిండా అవే ఆయుధాలుగా ఉండేవి. శత్రువుల పీచమణచడానికి వాటిని పెద్ద ఎత్తున వాడేవారు. కత్తితో ప్రత్యర్ధుల కుత్తులకు కోసేవారు.

ఆ తరువాత తెల్లవారి పాలన మొదలుకావడంతో తుపాకులు మన ఆయుధాలు అయ్యాయి. అయితే రాజుల సీమగా ఖ్యాతి పొందిన విజయనగరం వంటి జిల్లాల్లో ఇప్పటికీ సంప్రదాయ యుద్ధ విద్యల పట్ల మక్కువ కలిగిన వారున్నారు. కొన్ని చోట్ల ఇంకా కత్తి యుద్ధం నేర్పే ఆసాములు ఉన్నారు.

మన సంప్రదాయ యుద్ధ కళలను పరిరక్షించుకోవడానికి భావితరాలకు వీటి గురించి తెలియచేయడానికి విజయనగరం జిల్లాలో ఏకంగా ఒక శిక్షణాలయాన్నే నెలకొల్పబోతున్నట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

కత్తి యుద్ధంతో పాటు కర్ర సాము ఇతర సంప్రదాయ యుద్ధ రీతులను అక్కడ నేర్పిస్తామని కూడా ఆయన చెబుతున్నారు. దీని వల్ల ఉపయోగం ఏంటి అన్న ప్రశ్న రావచ్చు. అయితే ఇవి మన వెనకటి కళలు, ఇవి మన సంప్రదాయ రూపాలు. 

కాబట్టి వీటిని సజీవంగా ఉంచడంతో పాటు భావి తరాలకు తెలియచేయడం మంచి పరిణామమే. అంతే కాకుండా వీటి ద్వారా సంప్రదాయ యుద్ధ కళలను నమ్ముకున్న వారికి ఉపాధి కూడా దొరుకుతుంది. మొత్తానికి రాజుల కోటలో కత్తి సాము నేర్పిస్తారు అన్న మాట.