Beast Review: మూవీ రివ్యూ: బీస్ట్

టైటిల్: బీస్ట్ రేటింగ్: 2/5 తారాగణం: విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్, వీటీవీ గ‌ణేష్, యోగిబాబు, అపర్ణా దాస్ తదితరులు కెమెరా: మనోజ్ పరమహంస ఎడిటింగ్: ఆర్. నిర్మల్ సంగీతం: అనిరుధ్ నిర్మాత: కళానిథి…

టైటిల్: బీస్ట్
రేటింగ్: 2/5
తారాగణం: విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్, వీటీవీ గ‌ణేష్, యోగిబాబు, అపర్ణా దాస్ తదితరులు
కెమెరా: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: ఆర్. నిర్మల్
సంగీతం: అనిరుధ్
నిర్మాత: కళానిథి మారన్
దర్శకత్వం: నెల్సన్
విడుదల తేదీ: 13 ఏప్రిల్ 2022

విజయ్ హీరోగా వస్తున్న చిత్రమనడంకన్నా “అరబిక్ కూతు…” పాటున్న సినిమా అంటే అందరూ ఈజీగా కనెక్టవుతారు.

పాటని చేసి విడుదల చేయడమే తప్ప ఏది ఎందుకు వైరలువుతుందో తెలియని రోజులివి. ఒకరకంగా లాటరీ తగిలినట్టు ఈ సినిమాలోని ఈ పాట విడుదలకి ముందే ఒక ఊపు ఊపేసింది. అదే ఈ సినిమాకి ప్రచారాస్త్రమయింది..మరొక పబ్లిసిటీ స్టంట్ అవసరం లేకుండాపోయింది.

సరే…ఇంతకీ సినిమాలో ఏముంది?

మొదటి నుంచీ చెబుతున్నదే…చెన్నైలోని ఒక షాపింగ్ మాల్ ని టెర్రరిస్టులు తమ ఆధీనంలోకి తీసుకుంటే అందులోనే ఇరుక్కున్న ఒక గూఢచారి బందీలని ఎలా రక్షించాడు, తీవ్రవాదుల్ని ఎలా తుదముట్టించాడన్నది ప్రధానమైన కథ.

ఇలా ఔట్లైన్ చెప్పేసి మరీ థియేటర్స్ కి రప్పించడమంటే తమ మేకింగ్ మీద మేకర్స్ కి ఉన్న నమ్మకం అనుకోవాలి.

మరి ఆ నమ్మకం నిలబడిందా? సినిమాని నిలబెట్టిందా? చూద్దం..

కథ పరంగా సీరియస్సే. కానీ పాత్రలు సీరియస్ గా బిహేవ్ చేయవు. ఒకరకంగా ఫార్స్ కామెడీతో నడిచే యాక్షన్ చిత్రమిది. ఈ జానర్లో చిత్రాలు వస్తుంటాయి కానీ పెద్ద స్టార్ ని పెట్టుకుని తీయడం మాత్రం సాహసమే. 

విజయ్ లాంటి మాస్ హీరో సినిమా అనగానే సీరియస్ యాక్షన్, రొమాన్స్, పాటలు, హీరో బిల్డప్..ఇలాంటివి ఆశించడం సహజం. కానీ దానికి భిన్నంగా ప్రయోగం చేస్తే ఫలితం అనుకున్నట్టు రాకపోవచ్చు. 

ఇదే సినిమా మిడ్ రేంజ్ హీరోతో “వరుణ్ డాక్టర్” టైపులో తీస్తే సేఫ్ అవుతుంది కానీ పెద్ద స్టార్ తో బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువ. 

కథలో లాజిక్ వెతికే పని అస్సలు పెట్టుకోకూడదని, యాక్షన్ సినిమాయే కానీ కామెడీ యాంగిల్లో చూడమని మైండ్ ని ట్యూన్ చేసే పనైతే పెట్టుకున్నాడు దర్శకుడు. ఎలాగంటే…తిహార్ జైల్లో ఉన్న అంతర్జాతీయ పాకిస్తానీ మిలిటెంట్ ని విడుదల చేయించడానికి షాపింగ్ మాల్ హైజాక్ ప్లాన్ వెస్తారు టెర్రరిస్టులు. అయితే ముందుగా ఆ జైల్లో ఉన్న మిలిటెంట్ ని చాలా బిల్డప్పుతో చూపిస్తాడు లో-యాంగిల్ షాట్లో. తీరా అతను విడుదలయ్యి బయటికొస్తున్నప్పుడు అర్థమవుతుంది అతనొక మరుగుజ్జు అని.  ఈ అనుకోని సీన్ తో సహజంగానే సీరియస్నెస్ తగ్గి నవ్వొస్తుంది. ఇలాంటివే చాలా ఉన్నాయి. 

ఎవరి పర్మిషనూ లేకుండా అప్పటికప్పుడు ఫైటర్ జెట్ ప్లేన్ ఎరేంజ్ చెసేసుకోవడం, బిలీవబిలిటీకి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉండే స్టంట్స్ చేయడం ఇందులోని హీరో ప్రత్యేకత. టెర్రరిస్టులు బులెట్ల వర్షం కురిపిస్తున్నా మచ్చుకి ఒక్కటి కూడా హీరోకి తగలదు. అదే మన హీరో యాధృచ్ఛికంగా షూట్ చేసినా టెర్రరిస్టులు ఢమాల్న పడిపోతారు. ఈ తరహా స్టంట్స్ దశాబ్దాలుగా చూసి చూసి విసుగొచ్చినా ఈ ఫార్సికల్ నెరేషన్లో తప్పదు. 

80% కథ షాపింగ్ మాల్లోనే జరుగుతుంది. ఒక పెద్ద స్టార్ సినిమాకి… పైన చెప్పుకున్నట్టు ఇలాంటివే మైనస్. 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద గొప్పగా లేదు. ఇతర సాంకేతిక విలువలన్నీ బాగానే ఉన్నాయి. 

వీటీవీ గణేష్ డైలాగ్స్ అన్నీ గొప్పగా లేకపోయినా సాధ్యమైనంతవరకూ అక్కడక్కడ నవ్వించగలిగాయి. సెల్వరాఘవన్ కూడా కాసేపు గుర్తుండే పాత్రలో కనిపించాడు. 

పూజ హెగ్డేది అసలు ఇంపార్టెన్సే లేని కేరక్టర్. రెండు పాటలకి తప్ప దేనికీ ఉపయోగపడలేదు. అన్నట్టు సినిమాలో ఉన్నవే రెండు పాటలు. 

కథ ఎలా రాసుకున్నా, ట్రీట్మెంట్ మాత్రం పక్కా కామెడీగా ఉండాలని డిసైడైపోయి తీసిన సినిమా ఇది. అలాగని కమెర్షియల్ గా పాటలుండాలని ఫార్ములా ఫాలో కాలేదు. 

బీ,సీ మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ కి, పిల్లలకి ఈ సినిమా నచ్చొచ్చు. తక్కిన ఆడియన్స్ మాత్రం నిర్మొహమాటంగా పెదవి విరిచేస్తారు. 

బాటం లైన్: ఫార్స్ కామెడీ