cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: తిమ్మరుసు

మూవీ రివ్యూ: తిమ్మరుసు

చిత్రం: తిమ్మరుసు
రేటింగ్ : 2.5/5
తారాగణం: సత్యదేవ్, ప్రియాంకా జవల్కర్, అంకిత్ కొయ్య, రవిబాబు, అజయ్, బ్రహ్మాజి, ఆదర్ష్, జయశ్రీ రాచకొండ తదితరులు 
ఎడిటర్: బిక్కిన తిమ్మరాజు
కెమెరా: అప్పు ప్రభాకర్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
కథ: ఎం. జి. శ్రీనివాస్
సంభాషణలు: వేద వ్యాస్
నిర్మాత: మహేష్ కోనేరు, యరబోలు సృజన్  
స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శరణ్ కొప్పిసెట్టి
విడుదల తేదీ: జూలై 30, 2021

కరోనా కాలంలో ఓటీటీల ఊపులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. "తిమ్మరుసు" టైటిల్తో ఈ రోజు థియేటర్లోకొచ్చాడు. కరోనా రెండో కెరటం కాస్త సద్దుమణిగాక విడుదలైన తొలి చిత్రం ఇదే. 

కథలోకి వెళితే...ఒక క్యాబ్ డ్రైవర్ హత్యతో కథనం మొదలవుతుంది. 22 ఏళ్ల కుర్రాడు (అంకిత్ కొయ్య) ఈ హత్యలో నిందుతుడిగా ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తాడు. తర్వాత పెరోల్ మీద బయటికొచ్చిన అతనికి సంబంధించిన కంపెన్సేషన్ కేసుని టేకప్ చేస్తాడు లాయర్ రామచంద్ర (సత్యదేవ్). 

రామచంద్ర చాలా సిన్సియర్. న్యాయం కోసమే నిలబడతాడు తప్ప డబ్బుకి అస్సలు అమ్ముడుపోడు. అతని ప్రియురాలు (ప్రియాంక), ఫ్రెండ్ సుధ (బ్రహ్మాజి) కూడా అతనితో పాటే పని చేస్తుంటారు. 

తాను టేకప్ చేసిన కేసులో రామచంద్రకి చాలా ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. చాలావరకు డార్క్ మెటర్ కూడా ఉంటుంది. ఒక్కొక్కటీ ఛేదించుకుంటూ అసలు హత్య మూలాన్ని ఎలా పట్టుకుంటాడనేదే కథ. 

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వందలాదిగా వచ్చాయి. చూసిన ప్రేక్షకులు కూడా బాగా ముదిరిపోయారు. ఆ జానర్ లో సినిమాలు రాసుకోవాలంటే విపరీతమైన ఐక్యూ వాడాలి. ప్రేక్షకులు ఊహించని విధంగా కథని నడిపించాలి. అడుగడుగునా హీరో తెలివితేటలు సమయస్ఫూర్తితో కనపడాలి. అంతే తప్ప దర్శకుడు తనకి కన్వీనియంట్ గా సన్నివేశాలు సృష్టించినట్టు ఉండకూడదు. 

ఉదాహరణకి పాతపేపర్లు కొనేవాడిని చూసేవరకు హీరోకి మర్డర్ రోజు నాటి న్యూస్ పేపర్ చూడాలని తట్టదు; సిగ్నల్లేని చోట హీరోయిన్ మొబైల్ కనెక్ట్ అవ్వకపోతే తప్ప హీరోకి సెల్ ఫోన్ డేటా తీసుకుని సాక్షిని ట్రేస్ చేయవచ్చన్న ఆలోచన రాదు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఈ సన్నివేశాల వల్ల హీరో ఇంటిలిజెన్స్ కనపడకపోగా "ఇంత ట్యూబులైటా" అనిపిస్తుంది. సాధారణంగా ఏ నేర పరిశోధనలో అయినా మొబైల్ కాల్ డేటాల్లాంటివి కీలకం. అది కామన్ సెన్స్ తో ఆటోమెటిగ్గా చెయ్యాల్సిన పని. దానికి లీడ్ గా ఇన్స్పిరేషన్ సీన్ అవసరం లేదు. 

ఇక హీరో ఈ సినిమాలో లాయరో, డిటెక్టివో, పోలీసో అర్థం కాదు. లాయర్ లాగ కోర్టులో కనిపిస్తాడు, డిటెక్టివ్ లాగా రిస్కుల్లో పడి నేరస్థుల్ని ట్రాక్ చేస్తాడు, కత్తులతో వచ్చిన పది పదిహేను మంది రౌడీ గ్యాంగ్ ని ఒంటి చేత్తో సినిమా పోలీస్ లాగ మట్టి కరిపిస్తాడు. ఈ కమెర్షియలైజేషన్ వల్ల థ్రిల్లు పోయి బలవంతపు హీరోయిజన్ని భరించాల్సి వస్తుందన్న సంగతి గ్రహించకపోవడమే ఐక్యూ ని సరిపడా వాడకపోవడానికి నిదర్శనం.  

ఒక హత్యోదంతాన్ని ఒక్కక్కరు ఒక్కో యాంగిల్లో నెరేట్ చేయడమనే ఐడియా బాగానే ఉంది. సరిగ్గా హ్యాండిల్ చేస్తే "విరుమాండీ" లాగ మంచి స్క్రీన్ ప్లే అయ్యుండేది. కానీ ఇది చాలా సాదాసీదాగా తయారైన కంట్రైవ్డ్ కథ. ఈ హత్యోదంతంలో సగం-మర్డర్ చేసిన దొంగ ట్రాక్ నిజంగా అనవసరం. ప్రేక్షకుల్ని బలవంతంగా కాసేపు డైవర్ట్ చేసి సినిమా నిడివి పెంచడం తప్ప. చివర్లో విలన్ క్యారెక్టర్ కూడా వీక్ గానే ఉంది. అసలింత యాక్షన్ ఎపిసోడ్ కండక్ట్ చేయడానికి అతనికి గల కారణం బలంగా లేదు. 

టెక్నికల్గా ఈ సినిమా వెనకపడిందనే చెప్పాలి. ఉన్నంతలో శ్రీచరణ్ నేపథ్య సంగీతం బాగానే ఉన్నా ఎడిటింగ్ మాత్రం డీలాపడింది. పెరోల్ మీదున్న వ్యక్తిని రెండో సారి ఎందుకు అరెస్టు చేస్తున్నారో పోలీస్ లాయర్ కి ఫోన్లో చెబుతాడు. అక్కడికది ఆడియన్స్ కి కన్వే అయిపోయింది. మళ్లీ పోలీస్ స్టేషన్లో అదే ప్రశ్న వేయడం, అదే సమాధానం చెప్పడం లాంటివి రిపీట్ అవడం ఎడిటింగ్ లోపమే. ఒక చోట కత్తెరేయాలి కదా. హీరో-హీరోయిన్ ట్రాక్ కూడా అనవసరంగానూ, పేలవంగానూ ఉంది. పూజ సన్నివేశంలో దర్శకుడి ఆర్టిఫీషియాలిటీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి సన్నివేశాలు ఎన్ని పాత సినిమాల్లో చూసామో లెక్కుండదు. ఇక్కడ కూడా ఎడిటర్ నిక్కచ్చిగా ఉండాలిసింది. 

టైటిల్లో చైత్ర, సబ్ టైటిల్లో రామాయణం తట్టేలా పెట్టారు. ఆ రెండింటినీ జస్టిఫై చేయడానికన్నట్టు రామచంద్రకి, వాలిలాంటి విలన్ కి మధ్యన జరిగే యుద్ధం నడపాలి. వాలి నిజంగా అంత బలవంతుడిగా కనపడాలి. కానీ ఆ వర్కేమీ జరగలేదు. 

సత్యదేవ్, అంకిత్ కొయ్య నటనతో మెప్పించారు. విలన్ పోలీసుగా అజయ్, నెగటివ్ పాత్రలో రవిబాబు, సైడ్ కిక్ గా బ్రహ్మాజి ఇలాంటివి చాలా చేసేసారు..కొత్తదనమేమీ లేదు. అసలైన మెయిన్ విలన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉన్నా దర్శకుడు ఇచ్చిన బిల్డప్పుకి మ్యాచ్ అవ్వలేదు.  

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి తెలివైన మంత్రి "తిమ్మరుసు" పేరుతో వచ్చిన ఈ సినిమా మరీ అంత పాతగా కాకపోయినా, పాత పద్ధతిలోనే అల్లుకున్న థ్రిల్లర్. అక్కడక్కడా పర్వాలేదనిపించినా అంతలోనే ఇంతేనా అనిపించేట్టుగా తెరకెక్కిన సినిమా ఇది. చాలా కాలం తర్వాత థియేటర్లు తెరిచారన్న ఊపులో హాలుకెళ్లి సినిమా చూడాలనిపిస్తే చూడొచ్చు.

బాటం లైన్: కథ బిరుసు

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×