చిత్రం: జీబ్రా
రేటింగ్: 2/5
నటీనటులు: సత్యదేవ్, డాలీ ధనుంజయ్, ప్రియ భవాని శంకర్, సునీల్ వర్మ, సత్య, జెన్నిఫెర్ తదితరులు
సంగీతం: రవి బస్రూర్
కెమెరా: సత్య పొన్మర్
ఎడిటింగ్: అనీల్ క్రిష్
నిర్మాత: ఎస్సెన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం
దర్శకత్వం: ఈశ్వర్ కార్తిక్
విడుదల: 22 నవంబర్ 2024
ఎంత ట్యాలెంటున్నా ఎంచుకున్న ప్రాజెక్ట్ సరైనది కాకపోతే సక్సెస్ రాదు. మంచి ప్రాజెక్టులు దొరకడానికి అదృష్టం కూడా కలిసిరావాలి. సత్యదేవ్ కి ట్యాలెంటుంది కానీ అలాంటి అదృష్టం కలిసిరావట్లేదు. ఈ సారైనా కలిసొచ్చిందా అనేది చూద్దాం.
సూర్య (సత్యదేవ్) ఒక బ్యాంక్ ఉద్యోగి. స్వాతి (ప్రియ భవాని శంకర్) అతని కొలీగ్. ఆమె పొరపాటున చేసిన రాంగ్ ట్రాన్సాక్షన్ వల్ల కథకి బీజం పడుతుంది. ఆమెను ఆ సమస్య నుంచి రకరకాల ఫ్రాడ్లు చేసి నిమిషాల్లో బయటపడేస్తాడు సూర్య. కానీ ఆ ఫ్రాడ్ల పర్యవసానం వల్ల ఆది (డాలీ ధనజయ), మోహన్ గుప్త (సునీల్) సూర్య జీవితంలోకి వస్తారు.
వాళ్ల కారణంగా మరింత పెద్ద ఫ్రాడ్ చేస్తాడు. దానిని కవర్ చేయడానికి బ్యాంక్ దోపిడి చేయాల్సి వస్తుంది. ఆ బ్యాంకులో ఎవ్వరికీ నచ్చని స్నేక్ అనబడే శీలా అనే ఆఫీసర్ ఉంటుంది. ఆమె కళ్లుగప్పి సూర్య, స్వాతి, వాళ్ల ఫ్రెండ్ (సత్య) దోపిడికి ఎలా పాల్పడతారు? చివరికి దొరికిపోతారా, తప్పించుకుంటారా అనేది తక్కిన కథ.
ప్రధాన కథ ఇదే అనుకున్నా ఇక్కడ ఆది పాత్రకి ఒక సెపరేట్ కథ ఉంది. అతనికి కనెక్టయ్యి చూస్తే సినిమా కథ వేరేగా చెప్పుకోవాలి.
ఇలాంటి బ్యాంక్ దోపిడీ కథలు కొత్తేమీ కాదు. తాజాగా వచ్చిన లక్కీ భాస్కర్ కూడా ఈ బాపతే. కానీ అందులో ప్రతి అంశాన్ని ఉత్కంఠభరితంగా చిత్రించాడు దర్శకుడు. ఎప్పటికప్పుడు టెన్షన్, రిలీఫ్..మరో కొత్త టెన్షన్, మళ్లీ రిలీఫ్..అన్నట్టుగా సాగింది ఆ చిత్రం స్క్రీన్ ప్లే. పైగా బ్యాంకింగ్ వ్యవస్థకి చెందిన అంశాలని సమాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే సమాచారం కంటే ఎమోషన్ ఎక్కువ డామినేట్ చెయ్యాలి. అది లక్కీ భాస్కర్ లో కుదిరినట్టు ఈ “జీబ్రా” లో కుదరలేదు.
కథనమంతా కంఫ్యూజింగ్ గా, అయోమయంగా సాగుతుంటుంది. దానికి తోడు సునీల్ పాత్ర అసహ్యకరమైన మాటలు మాట్లాడడం (బీప్ లు వేసినా గానీ), డెప్త్ లేని డైలాగ్స్, అర్ధం పర్ధం లేని పాటలు విసిగిస్తాయి. శీలా పేరుతో కనిపించిన నటి కూడా ఇంగ్లీష్ యాసలో తెలుగు ఉచ్చరిస్తూ, ఏదో బూతు ధ్వనిస్తున్నట్టుగా మాట్లాడుతుంటుంది.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాలేదు. పాటలు మరీ ఔట్ డేటెడ్ గా ఉన్నాయి. ఐటం సాంగైతే 1980ల్లో వచ్చిన సి-గ్రేడ్ సినిమాల్లోలా ఉంది.
సన్నివేశకల్పన, కథాగమనం అంతా ఆర్టిఫీషియల్ గా ఉంది తప్ప ఏదీ ఆర్గానిక్ గా ఫ్లో అవుతున్నట్టు అనిపించదు. సత్యరాజ్ క్యారెక్టర్ ఎందుకుందో కూడా అర్ధం కాదు. ప్యాన్ ఇండియా పేరుతో కర్ణాటక ఆడియన్స్ కోసం డాలీ ధనంజయ్, తమిళనాడు కోసం సత్యరాజ్ ని పెట్టుకున్నట్టు ఉంది తప్ప అసలా సత్యరాజ్ పాత్ర లేకపోతే సినిమాకి వచ్చే నష్టమేంటో తెలీదు.
సినిమాలో హీరో తల్లిది చాలా షార్ప్ బ్రెయిన్ అని చూపించాడు. ఆమె ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేస్తుంది. కొడుకు చేసిన తప్పుల్ని కూడా ఆమె సింగిల్ లుక్కులో గ్రహించేస్తుంది. అలా ఈ చిత్ర రచయిత, దర్శకుడు స్కిప్టులో ఉన్న లోపాలని షార్ప్ బ్రెయిన్ తో కనిపెట్టి ఉంటే బాగుండేది.
ప్రధమార్ధమంతా అయోమయంగా, ఆయాసభరితంగా సాగితే సెకండాఫులో సడెన్ గా డాలీ ధనంజయ పాత్రకి ఒక హీరోయిన్ ని ప్రవేశపెట్టి కాసేపు అతని ట్రాక్ నడిపాడు దర్శకుడు. ఎంత క్లుప్తంగా ముగించినా అప్పటి వరకు అలసిపోయి ఉన్న ప్రేక్షకులకి అది పరీక్షే.
సెకండాఫులో “గాయాలైన ఓ నరుడా” అనే పాట వస్తుంది. ఆ పాటని ప్రేక్షకుడు తనకి తాను ఆపాదించుకుని తన మీద తానే జాలిపడేలా ఉంటుంది. అంత సేపు “జీబ్రా” తంతున్నా భరిస్తూ, ఎప్పటికీ ఎడతెగని కథని చూస్తూ ఉన్న ఫీలింగొస్తుంది.
కానీ ఆ తర్వాత బ్యాంక్ వాల్ట్ రోబరీ సీక్వెన్స్ బీటెన్ ట్రాక్ అయినప్పటికీ ఉన్నంతలో కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. కానీ సీన్లన్నీ చాలా వీక్ గా, సిల్లీగా, కన్వీనియంట్ గా రాసుకున్నవే. ఎక్కడా నేచురల్ ఇంటిలిజెన్స్ కనపడదు.
టెక్నికల్ గా కెమెరా వర్క్, నిర్మాణవిలువలు బాగున్నాయి.
సత్యదేవ్ బ్యాలెన్స్డ్ గా చేసుకుపోయాడు. ప్రియా భవానీ శంకర్ కి నటించడానికి మరీ అంత స్కోప్ ఉన్న పాత్ర కాదు కానీ, సినిమా మొత్తం కనిపించే కేరెక్టర్.
సత్య అక్కడక్కడ నవ్వించాడు. డాలీ ధనంజయ్ ట్రాక్ సీరియస్ గా సాగుతుంది. సునీల్ కామెడీ విలన్ గా ఓకే.
జెన్నిఫర్ శీలా పాత్రలో కనువిందు చేస్తూనే, మాటలతో చెవులకి తుప్పు పట్టించింది.
మిగిలిన నటీనటులంతా వాళ్ల పరిధిలో చేసుకుపోయారు.
ఓవరాల్ గా చూస్తే ఇది కొత్తదనం లేని ఒక రొటీన్ బ్యాంక్ దోపిడీ కథ. కథనంలో చాలా లోపాలున్నాయి. అందుకే సమర్ధవంతంగా ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యింది. కాస్త బాగుందనిపిస్తే, అంతలోనే గ్రాఫ్ పడిపోతుంటుంది. అంతా అయ్యాక క్లైమాక్స్ కూడా ఒక పట్టాన క్లోజవ్వదు. పైగా నాలుగు లక్షలు, నలభై లక్షలు, ఐదు కొట్లు, రెండున్నర కోట్లు…ఇలా రకరకాల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎందుకో, ఎవరికోసమో, ఏ ఎమోషన్ తో చూడాలో అంతుపట్టదు. తీరా అంతా అయ్యాక ఒక అనాధశరణాలయం దగ్గర సో-కాల్డ్ ఎమోషనల్ సీన్ ఒకటి. సినిమా మొత్తం అక్కడక్కడ మెదడుని కదిలిస్తుందేమో తప్ప మనసుని మాత్రం కదిలించదు. అంతా గజిబిజి కంగాళీగా సాగిన కాంప్లికేటెడ్ ఆల్”జీబ్రా” పాఠం ఈ “జీబ్రా”.
బాటం లైన్: అర్ధంకాని ఆల్ “జీబ్రా”
మెగాస్టార్ గెస్ట్ గా వచ్చిన మూవీ కి 2 రేటింగే గా.. వాల్తేరు వీరయ్య కి 2 రేటింగే
ఐతే థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు
Great thatha garu telugu moviesvki 2or 2.5 ekuva evaru rating tamil movies ki 3estharu thatha garu baguna leakpoyanina
vc available 9380537747
Ni bo_(beep) kaadhu… Anni cinemalaki rating lu ilage isthava… Ni matti burraki ardham kakapothey cinema bagaledhana… Cinema bagundhi… Nilanti valla vallane thamilanadu lo review lu ban cheyincharu… Telugu rastrallo kuda ala chesthey peeda viragadayidhi…
Call boy jobs available 7997531004