Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

థియేటర్ల బంద్‌ వల్ల దాదాపు వారం రోజుల పాటు థియేటర్లన్నీ మూతపడ్డాయి. మల్టీప్లెక్సుల్లో హిందీ, ఇంగ్లీష్‌ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు ప్రదర్శించలేదు. గత వారం సినిమాలేవీ విడుదల కాకపోగా, మార్కెట్లో వున్న సినిమాల బిజినెస్‌కి కూడా గండి పడింది.

మార్చి ప్రథమార్ధంలో పరీక్షలు వుంటాయి కనుక మన సినిమాలకి సహజంగానే ఈ టైమ్‌లో వసూళ్లు తక్కువ. ఈసారి సమ్మెపోటుతో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఈవారంలో కూడా ఏ మంత్రం వేసావె తప్ప మరో సినిమా విడుదల కావడం లేదు. విజయ్‌ దేవరకొండ హీరో అయినప్పటికీ ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం లేట్‌ అవడంతో అంతగా క్రేజ్‌ లేదు.

వచ్చే వారం విడుదలవుతోన్న కిరాక్‌ పార్టీతో మళ్లీ సినిమా సందడి స్టార్ట్‌ అవుతుంది. వారానికో చెప్పుకోతగ్గ సినిమా విడుదలతో మళ్లీ బాక్సాఫీస్‌ వద్ద కళ రానుంది. మార్చి 30న రంగస్థలం రిలీజ్‌తో భారీ సినిమాల సందడి మొదలవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?