Advertisement

Advertisement


Home > Movies -

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

అల్లుశిరీష్‌ కలలు గన్న ఆ ఘన విజయం మళ్లీ ముఖం చాటేసింది. ఏబిసిడి అంటూ రీమేక్‌ కథని నమ్ముకున్నా కానీ విధి మరోసారి కాటేసింది. హీరోగా నిలదొక్కుకోవడానికే అవస్థలు పడుతోన్న అల్లు చిన్నబ్బాయికి వరుసగా రెండు ఘోర పరాజయాల నుంచి కోలుకునే చిత్రం రావడం కాస్త కష్టమే మరి. చిన్న, మధ్య తరగతి హీరోలు ఎక్కువగా వున్న టైమ్‌లో ఒక మంచి కథ ఎందరినో దాటితే తప్ప తన దాకా రాదు.

సక్సెస్‌లో వున్నా దర్శకులు కాస్త రిస్క్‌ చేస్తారేమో కానీ ఫ్లాప్స్‌ వచ్చినపుడు తనని హీరోగా కన్సిడర్‌ కూడా చేయరు. ఏబిసిడి తొలి రోజు ఫర్వాలేదనిపించే వసూళ్లు తెచ్చుకున్నా సెకండ్‌ డేకి డ్రాప్‌ అయి ఇక మళ్లీ కోలుకోలేదు. సురేష్‌బాబు పేరుని జత చేసినా, పెళ్లి చూపులు నిర్మాతలలో ఒకరు చేయి వేసినా పని జరగలేదు. 'మహర్షి' చిత్రానికి పోస్టర్లపై వేసుకున్న అంకెలన్నీ నిజం కావు కానీ మొత్తంగా అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌గా పర్‌ఫార్మ్‌ చేసింది.

కొన్ని ఏరియాల్లో భారీ నష్టాలని చవిచూసినా కొన్ని చోట్ల పెట్టుబడిని రాబట్టుకోగలిగింది. ఇది తన కెరీర్లో అత్యుత్తమ చిత్రమని మహేష్‌ చేసిన హడావుడిని ఫాన్స్‌ కూడా నమ్మలేదు. ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్‌గానే కొట్టి పారేసారు. వంద కోట్ల షేర్‌ని సాధిస్తాడనే ఫాన్స్‌ కలలని మహేష్‌ వరుసగా రెండోసారి సాకారం చేయలేదు. ఇక అనిల్‌ రావిపూడి సినిమాపైనే వారు నమ్మకం పెట్టుకున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?