రవితేజ ‘పవర్‌’ ఫస్ట్‌ లుక్‌

రేపు (జనవరి 26) రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా రవితేజ తాజా చిత్రం ‘పవర్‌’ ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకి కె.ఎస్‌. రవీంద్ర…

రేపు (జనవరి 26) రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా రవితేజ తాజా చిత్రం ‘పవర్‌’ ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకి కె.ఎస్‌. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

పోలీస్‌ గెటప్‌లో.. పక్కా మాస్‌ లుక్‌తో రవితేజ ఈ సినిమాలో కన్పించనున్నాడని ఫస్ట్‌ లుక్‌ చూస్తే అర్థమవుతోంది. రవితేజ అంటే ఎనర్జీ.. రవితేజ అంటే మాస్‌.. ‘పవర్‌’లో రవితేజ మాస్‌ పవర్‌ ఏంటో చూస్తారంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

రవితేజ సరసన హన్సిక, రాగిణీ ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. రవితేజ – తమన్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే పలు సినిమాలొచ్చాయి, తమన్‌ మ్యూజిక్‌ తన సినిమాలకు అదనపు ఆకర్షణ అని చెబుతుంటాడు రవితేజ.