రామ్‌చరణ్ – కృష్ణవంశీ సినిమాకి గోవిందుడు అందరి వాడేలే అనే టైటిల్ పెడుతున్నట్టు నాలుగు రోజుల నుంచీ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హడావుడి చేసింది. ఈ టైటిల్‌పై చిన్నిపాటి చర్చ కూడా మొదలైంది. మెగా ఫ్యాన్స్ నుంచి ఈ టైటిల్‌కి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది.
కొంతమంది టైటిల్ బాగుంది, క్లాస్ గా ఉంది అని పొగిడితే – చాలామంది మాత్రం ఎన్టీఆర్ సినిమా బృందావనంకి పెట్టుకొన్న క్యాప్షన్ టైటిల్ గా వాడుకోవాల్సిన ఖర్మ ఎందుకొచ్చిందని కృష్ణవంశీని నేరుగానే అడిగేస్తున్నారట. ఈ ఫీడ్ బ్యాక్ గమనించిన చిత్రబృందం హడావుడిగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. మా సినిమా టైటిల్ అది కాదు… అని ప్రకటించింది.
మెగా ఫ్యాన్స్ ఒత్తిడి వల్లే ఈ టైటిల్ మార్చుకొంటున్నట్టు టాక్. టైటిల్ నేరుగా చెప్పకుండా ఓ ఫీలర్ వదిలి – ఫీడ్ బ్యాక్ తెచ్చుకొన్నాడన్నమాట. కృష్ణవంశీ భలేటి ప్లాన్ వేశాడు. కానీ అది వేస్టయిపోయింది. ఫ్యాన్స్ ఇంకా తెలివైనవాళ్లు సుమీ..