త్వరలోనే తను పెళ్లి చేసుకోబోతున్నట్టు పరోక్షంగా వెల్లడించింది రేణుదేశాయ్. తన కాబోయే భర్త ఎవరు, అతడి ఫొటో లాంటి వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే కాబోయే భర్త వివరాల్ని వెల్లడిస్తుందని అంతా ఎదురుచూస్తున్న టైమ్ లో మరో బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది రేణుదేశాయ్. .
ఈసారి ఏకంగా తన నిశ్చితార్థం ఫొటోను పోస్ట్ చేసింది. తనకు ఎంగేజ్ మెంట్ పూర్తయిందనే విషయాన్ని స్వయంగా వెల్లడించింది. అయితే ఈసారి కూడా తన కాబోయే భర్త ఎవరనే విషయాన్ని రేణుదేశాయ్ వెల్లడించలేదు. ఆమె స్పీడ్ చూస్తుంటే త్వరలోనే సీక్రెట్ గా పెళ్లాడి, ఆ మేటర్ ను కూడా ఇలానే సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుందేమో. బహుశా పెళ్లి తర్వాత రేణుదేశాయ్ తన భర్త వివరాల్ని బయటపెట్టొచ్చు.
ఈమధ్య పవన్ కల్యాణ్ కొత్త ఇంటికి పవన్-రేణు సంతానమైన అకిరా వచ్చాడు. విజయవాడలో అద్దెకు దిగిన ఆ ఇంట్లో పవన్, అన్నా లెజనెవాతో పాటు అకిరా కూడా కనిపించాడు. ఇంత సడెన్ గా పవన్ తో పాటు అకిరా కనిపించడం వెనక రీజన్ ఏమై ఉంటుందా అని అంతా ఆరా తీశారు. రేణు దేశాయ్ నిశ్చితార్థం కారణంగానే అకిరా, పూణె నుంచి విజయవాడ వచ్చినట్టున్నాడు.
కేవలం హాలిడేస్ లోనే తండ్రితో గడిపేందుకు అకిరా బెజవాడ వచ్చాడని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది. అయితే అకిరా లేకుండానే నిశ్చితార్థ వేడుక పూర్తిచేసింది. రేణు దేశాయ్ మరొకర్ని పెళ్లిచేసుకుంటున్న నేపథ్యంలో.. అకిరా ఎవరితో ఉంటాడో చూడాలి.