బ్యూటీఫుల్, మిస్టీరియస్, వైల్డ్ అండ్ ఫ్రీ.. అంటూ సముద్రాన్ని వర్ణించింది సమంత రూత్ ప్రభు. కాబోయే శ్రీవారు నాగ చైతన్యతో కలిసి క్రిస్మస్ టూర్ లో ఉన్న సమంత ఇన్ ఇస్టాగ్రమ్ లో ఈ ఫొటోను పోస్ట్ చేసింది. సముద్రాన్ని ఏయే పదాలతో వర్ణించిందో ఈ ఫొటోలోని సమంతను వర్ణించాడానికి కూడా అవే పదాలు సరిగా సూటవుతాయి.
Advertisement
తన ఫేవరెట్ మంత్ ను , ఫేవరెట్ పండగను ఇలా జాలీగా సెలబ్రేట్ చేసుకుంటున్న సమంత పెళ్లి గురించి ఇక్కడైతే చాలా కబుర్లు వినిపిస్తున్నాయి. జనవరి 29 వ తేదీన చైతూ- సమంత ల నిశ్చితార్థం అనే మాట వినిపిస్తోంది. ఈ విషయం గురించి ఇప్పటి వరకూ అక్కినేని కుటుంబీకులెవరూ అధికారికంగా స్పందించలేదు.