2024లో అధికార‌మే ల‌క్ష్యం- ప‌వ‌న్‌

2024లో అధికార‌మే ల‌క్ష్య‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కల్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఆ దిశ‌గానే బీజేపీతో క‌ల‌సి ప‌నిచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. బీజేపీ-జ‌న‌సేన పార్టీల భావ‌జాలం ఒక‌టేన‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌లో బీజేపీ -జ‌న‌సేన పార్టీల…

2024లో అధికార‌మే ల‌క్ష్య‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కల్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఆ దిశ‌గానే బీజేపీతో క‌ల‌సి ప‌నిచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. బీజేపీ-జ‌న‌సేన పార్టీల భావ‌జాలం ఒక‌టేన‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌లో బీజేపీ -జ‌న‌సేన పార్టీల నాయ‌కులు కీల‌క స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం జ‌న‌సేన అధినేత వ‌ప‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ ఏపీకి బీజేపీ అవ‌స‌రం  చాలా ఉంద‌న్నారు.

రాజ‌ధాని రైతుల్ని నిండా ముంచార‌న్నారు. ఇంత పెద్ద రాజ‌ధాని అవ‌స‌రం లేద‌ని ఆనాడే చెప్పాన‌ని ప‌వ‌న్ చెప్పారు. ఏపీ భ‌విష్య‌త్ కోసం బీజేపీతో క‌ల‌సి ముందుకు వెళుతున్నామ‌న్నారు. స్థానిక‌, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ -జ‌న‌సేన క‌ల‌సి పోటీ చేస్తాయ‌ని ప‌వ‌న్ చెప్పారు. 2014 త‌ర్వాత బీజేపీతో ఎందుకు స‌మ‌స్య వ‌చ్చిందో స‌మావేశంలో మాట్లాడుకున్నామ‌న్నారు.

రైతుల‌కు టీడీపీ భ‌రోసా ఇవ్వ‌లేక‌పోయింద‌ని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్రంలో బ‌ల‌మైన ప్ర‌భుత్వం ఉండ‌డం వ‌ల్ల రాష్ట్రానికి మంచిద‌ని ప‌వ‌న్ సెల‌విచ్చారు.