తొలిఏకాదశి పర్వదినం రోజున 2024 పోరాటం మొదలయింది !! ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్నేళ్ళుగా జరుగుతున్న పరిణామాలు మహాభారత యుద్ధానికి ముందు సంఘటనలతో సారూప్యత కలిగి ఉన్నాయి. అవే కుట్రలు… అవే అవమానాలు… అవే వ్యూహాలు… అవే ప్రతివ్యూహాలు… అవే ఎత్తులు… అవే జిత్తులు, పై ఎత్తులు.
చంద్రబాబు ధర్మరాజు కాదు. దుర్యోధనుడు కూడా కాదు. చివరికి దుశ్యాసనుడు కూడా కాదు. ఆయన శకుని. మాయా జూదంలో నేర్పరి. ఆయన చేతిలో చాలా పాచికలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు, ప్రతిపక్ష పార్టీల నేతలు. స్వపక్షంలోనే సూసైడ్ బాంబర్లు… ఇలా చాలా పాచికలు ఉన్నాయి. ఇతర పార్టీల్లో “స్లీపర్ సెల్స్” లా తనకోసం పనిచేసే వారు.
వ్యవస్థల్లో తన వేగులు చాలామందే ఉన్నారు. అవకాశం, అవసరాన్ని బట్టి ఆయా పాచికలను చంద్రబాబు వాడుతూ ఉంటారు. అయితే మహాభారత యుద్ధం మొదలయ్యాక ఈ పాచికలేవీ పనిచేయవు. పాచికలు పట్టిన శకుని, వ్యూహకర్త, మేధావి, మహామహులను చిత్తు చేసిన ఘనుడు అనే బిరుదులన్నీ యుద్ధం మొదలవ్వగానే “తుస్సు”మంటాయి. పాండవులలో చిన్నవాడు, చివరివాడు అయిన సహదేవుడు చేతిలో హతుడయ్యాడు.
యుద్ధంలో కూడా పలు వ్యూహాలు రచించిన యోధుడు శకుని. పద్మవ్యూహం పన్ని అభిమన్యుని హతమార్చాడు శకుని. అలాంటి శకుని సహదేవుని చేతిలో ముఖాముఖీ పోటీలో హతుడయ్యాడు. చంద్రబాబు కూడా అత్యంత చిన్నవాడు అయిన కె ఆర్ జె భరత్ చేతిలో కుప్పంలో 2024లో ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు.
శకుని తర్వాత దుర్యోధనుడి బలం కర్ణుడు. ఈ కర్ణుడు గొప్పవాడే… వీరుడే. కానీ దుర్యోధనుడి స్నేహం అతని పరాజయానికి కారణం అవుతుంది. కర్ణుడు కూడా చివరిదశలో అత్యంత కీలకమైన సర్వసైన్యాధ్యక్షుడి పదవి అలంకరిస్తారు. ఇది చాలా కీలకమైన పదవి. మొదటినుండీ దుర్యోధనుడు, శకునిని అంటిపెట్టుకుని ఉండి, వారి కుట్రలకు వత్తాసు పలుకుతాడు. వీరుడే అయినప్పటికీ కౌరవుల కుట్రలకు అండగా నిలిచినందుకు ఫలితం అనుభవిస్తాడు. అత్యంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ కౌరవసైన్యానికే అండగా నిలుస్తాడు. అందుకే చివరిలో తన కుట్రలే తనను మింగేస్తాయి. తన కుట్రలకు తానే బలవుతాడు.
వస్త్రాపహరణంతో మహిళను నిండు సభలో అవమానిస్తారు కౌరవ సైన్యం. దుశ్శాసనుడు ఓ అడుగు ముందుకేసి ఆమెను అవమానిస్తాడు. ఇంచుమించు ఇలాంటి పరాభవమే మహిళా నేత రోజాకు ఎదురవుతుంది. ఆమె ద్రౌపదో కాదో కానీ 2014-2019 మధ్యలో ఈ రాష్ట్రంలో కౌరవ సైన్యమే అధికారంలో ఉంది. ఆమెకు జరిగిన పరాభవానికి ద్రౌపదికి జరిగిన పరాభవానికి సారూప్యత ఉంది. అమరావతిలో దుశ్శాసనుడి స్వైరవిహారం కొనసాగింది. అన్ని న్యాయసూత్రాలను ధిక్కరించి రోజాను సభనుండి బహిష్కరించి అవమానించారు.
ఈ పర్వంలో దుర్యోధనుడి తరపున, మొత్తంగా కౌరవుల తరపున చక్రం తిప్పినవాడు దుశ్శాసనుడు. మహాభారత యుద్ధంలో మొదటిరోజు మొదటి బాణం వేసి యుద్ధాన్ని ప్రారంభించినవాడు దుశ్శాసనుడు. అలాంటి దుశ్శాసనుడు అత్యంత భయంకరమైన చావు పొందాడు. ఆ మరణం శత్రువులకు కూడా రాకూడదు. కౌరవులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అన్యాయాలు, అక్రమాలు చేసినా న్యాయం పాండవులపక్షానే ఉంది. కౌరవుల పతనం, పాండవుల విజయం ఎప్పుడో నిర్ణయమైంది.
అయితే దానికి ముందుగా శ్రీకృష్ణుడు కొన్ని వ్యూహాత్మక కార్యాలు చేస్తాడు. అదే దుర్యోధనుడి శక్తులను నిర్వీర్యం చేయడం. దుర్యోధనుడి శక్తి అంటే అతని వ్యక్తిగత బలం మాత్రమే కాదు, అతనికి యుద్ధంలో అండగా ఉంటారు అనుకున్న శక్తులు, వ్యక్తులు కూడా ఆయన బలమే. అలాంటి వ్యక్తుల్ని శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందుగానే తుదముట్టించేశాడు. యుద్ధానికి, యుద్ధంలో విజయానికి అదో ముందస్తు వ్యూహం.
దుర్యోధనుడు, భీముడు, కీచకుడు, జరాసంధుడు, బకాసురుడు… ఈ ఐదుగురూ సింహబలురు. బలంలో సమానులు. యుద్ధం వస్తే దుర్యోధనుడు మిగిలిన ముగ్గుర్ని తనవైపు తిప్పుకునే అవకాశం ఉంది. అప్పుడు ఈ నలుగురినీ ఓడించడం భీముడితో అయ్యేపని కాదు. అందుకే వనవాస సమయంలో బకాసురుణ్ణి, అజ్ఞాతవాస సమయంలో కీచకుణ్ణి అంతం చేస్తారు.
ఇక జరాసంధుడు పాండవులకు శత్రువు కాదు, కానీ కృష్ణుడు పాండవులపక్షం వహిస్తే జరాసంధుడు కౌరవులపక్షం వహించే అవకాశం ఉంది. అందుకే మహాభారత యుద్ధానికి ముందే కృష్ణుడు జరాసంధుడు మృత్యువుకు ప్రణాళిక వేస్తాడు. ఆ ప్రకారమే భీముడితో మల్లయుద్ధంలో జరాసంధుడు హతుడవుతాడు. ఇలా బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు వంటి బలమైన శక్తుల అండ కౌరవులకు లేకుండా చేయడం వల్లనే అంతిమంగా కౌరవులను ఓడించడం సాధ్యం అయింది. ఇప్పుడు జరుగుతున్నదీ ఇదే.
అమరావతి, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టులు, ప్రైవేటు విధ్య, వైద్యం మాఫియా , సారాయి సిండికేట్ లు వంటివి చంద్రబాబుకు బకాసురుడు, కీచకుడు, జరాసంధుడులా పనిచేస్తున్నాయి. యుద్ధానికి ముందే వాటిని నిర్వీర్యం చేస్తే తప్ప కౌరవుల్ని ఓడించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఓ బకాసురుడు (అమరావతి), ఓ కీచకుడు (రియల్ ఎస్టేట్), ఓ జరాసంధుడు (కాంట్రాక్టులు) పతన దశలో ఉన్నారు. వారి అంతం 2024 నాటి మహాభారత యుద్ధం నాటికి పూర్తవుతుంది.
ఈ శక్తులు నిర్వీర్యం అయితే కానీ కౌరవుల ఓటమి సాధ్యం కాదు. ఈ శక్తులను ఓడించడం కూడా అంత సాధ్యం కాదు. అయినా ఓ క్రమంలో, నెమ్మదిగా, ఒక్కొక్కటిగా ఓడిస్తూ ముందుకు సాగాల్సిందే. ఈ క్రమంలో కొన్నిసార్లు కౌరవులదే పైచేయి అయినట్టుగా కనిపిస్తుంది. బకాసురుణ్ణి, కీచకుణ్ణి, జరాసంధుణ్ణి ఓడిస్తున్నప్పుడు భీముడి గెలుపుపై ధర్మరాజుతో సహా పాండవులు కొన్నిసార్లు శంకించారు. కీచకుడు మల్ల యుద్ధంలో భీముడి రొమ్ములపై కూర్చున్నప్పుడు, శరీరాన్ని రెండుగా చీల్చినా జరాసంధుడు మళ్ళీ బ్రతికి నిలబడినప్పుడు… ఇలా చాలా సందర్భాల్లో పాండవుల గెలుపు, ప్రత్యర్థుల ఓటమి సాధ్యమయ్యేపని కాదు అనే అనుమానాలు కలిగాయి.
అంతెందుకు, లక్క ఇల్లు తగలబడినప్పుడు పాండవులు అంతం అయ్యారనే అనుకున్నారు అంతా. అలా అనేక సందర్భాల్లో, అనేక రూపాల్లో పరాజయమే విజయంగా భ్రమింపజేస్తుంది. 23 మంది MLA లకనుగోలు వ్యవహారం , పాదయాత్ర ఆపడం , మీడియా లో జగన్ మీద వ్యక్తిగత దాడి తదితర అంశాలలో శత్రువుదే పైచేయిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కనిపించే విజయాలు ఇలాంటివే.
యుద్ధం నివారించేందుకు పాండవులు చాలా ప్రయత్నాలు చేశారు. చివిరికి ఐదుగురికి ఐదూళ్ళు అయినా ఇవ్వమని అడిగారు. అందుకు కౌరవులు అంగీకరించలేదు. సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని భీష్మించి కూర్చున్నారు. ఇక్కడ అమరావతిలో నిరుపేదలకు ఇళ్ళస్థలాలకు తలో సెంటు భూమి ఇవ్వడానికి వీల్లేదని కోర్టుకెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. “అమరావతి మాది. సెంటు భూమి కూడా ఇచ్చేది లేదు” అంటూ కాలుదువ్వి మీసం మెలేస్తున్నారు.
శకుని ప్రోద్బలంతో కౌరవులు చేస్తున్న అన్యాయాలను “తప్పు” అని తీర్పు చెప్పాల్సిన స్థానంలో ఉన్న ధృతరాష్ట్రుడు అంధుడు కావడంవల్ల, పుత్రవాత్సల్యంతో మౌనంగా ఉన్నాడు. తన పుత్రులు చేసే అన్యాయాలు, అక్రమాలకు అండగా నిలిచాడు. ఇప్పుడు తప్పొప్పుల తీర్పు చెప్పాల్సిన పెద్దలు ఎందరో అభినవ ధృతరాష్ట్రుల్లా అంధులై కౌరవులకే అండగా నిలుస్తున్నారు.
గాంధారిలాగా కళ్ళకు గంతలు కట్టుకుని మౌనంగా ఉంటోంది. న్యాయం చెప్పాల్సిన ధృతరాష్ట్రుడు పుత్రవాత్సల్యంతో, న్యాయం జరిగేలా చూడలేదు గాంధారి తన కళ్ళ గంతలతో మౌనంగా ధృతరాష్ట్రున్ని అనుసరిస్తోంది. కౌరవ సంతతికి అనుకూలంగా ఉంటోంది.
ఈ మహాభారత ఘట్టం ముగియాలంటే 2024లో మహాభారత యుద్ధం జరగాల్సిందే. కర్ణుడి రథచక్రాలు భూమిలో కూరుకుపోవాల్సిందే. శకుని శకం ముగియాల్సిందే. దుర్యోధనుడి తొడలు విరగాల్సిందే. అంతకు ముందే బకాసురుడు, కీచకుడు, జరాసంధుడులా కౌరవులకు అండగా నిలిచిన అమరావతి, రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు కుప్పకూలిపోవాల్సిందే. పునాదులు కూకటివేళ్ళతో పెకలింపబడాల్సిందే. కౌరవుల పునాదులు కదిలిపోవాల్సిందే.
ఈ మహాయుద్ధంలో పాండవులు ప్రతి సైనికుడికీ పట్టం కట్టాల్సిందే. ఈ యుద్ధానికి ముందు అక్షౌహిణుల బాధ్యతలు పాండవులు తామే తీసుకోకుండా తమ సేనల్లో తలో అక్షౌహిణి బాధ్యత చేపట్టే అవకాశం ఇవ్వాల్సిందే. అన్ని వైపులనుండి అన్ని రకాల ఆయుధాలతో పాండవసేన కుట్రలు, కుతంత్రాల కౌరవసేనను మట్టికరిపించేందుకు సిద్ధం కావాల్సిందే.
Note : ఇది చదివితే మీకు స్పష్టంగా కొన్ని , కొందరు మనుషుల ప్రవర్తన , వారు చేసిన పనులు , వారి స్వభావం clear గా కనపడుతుంది … వివిద రాష్ట్రాలలో ఇదే పని చేస్తే అక్కడ ఒప్పు… జగన్ ఆంధ్రప్రదేశ్ లో చేస్తే తప్పు.. ఇదెక్కడి ఆలోచన అనేది చంద్రబాబు ఆలోచించాలి. ఇదేమీ 1978 నాటి రోజులు కాదు. ప్రతి ఒక్కటీ ఆలోచించ గల జ్ఞానం , ఆలోచన, శక్తి ఈ రోజున ప్రజలకు వచ్చింది. క్షణాల్లో whatsup , youtube , facebook ల ద్వారా పల్లెలకు చేరుతుంది. ఎవరి ఆర్ధిక ప్రయోజనాలు, ఎవరి వ్యతిగత ప్రయోజనాలు కాపాడటాని ఎవరెవరు ఎలా సహాయ సహాకారాలు అందిస్తున్నారు అనేది ప్రజలు లోతుగానే చర్చించుకుంటున్నారు.
పిల్లి దొంగచాటుగా పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడటం లేదు అనుకుంటుంది … కానీ మీసాలకి అంటిన పాలు & గిన్నెలో పాలు ఏమయ్యాయి అనేది ఎవరికీ తెలియకుండా ఉండదు. అలాగే చంద్రబాబు కోసం , చంద్రబాబు కులం కోసం , తెలుగుదేశం ఎవరెవరు ఏమేమి సహాయా సహాకారాలు ఎలా ఏ విధంగా అందిస్తున్నారు అనేది ప్రజలలో చర్చ జరుగుతుంది. జరిగి తీరుతుంది . ఈ ప్రజలే 2024 ఎన్నికల కురుక్షేత్రం లో పోరాడబోతున్నారు … వారికి ఎవరు కావాలో నిర్ణయించబోతున్నారు. ఈ దిశగా ప్రజల పోరాటం మొదలవ్వాలి…
Facebook post by Sridhar Avuthu