ఏపీలో కొత్తగా 23 కేసులు.. 3 కరోనా మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో మొత్తంగా 23 కేసులు వెలుగుచూశాయి. ముగ్గురు మరణించారు. కొత్తగా…

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో మొత్తంగా 23 కేసులు వెలుగుచూశాయి. ముగ్గురు మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలులో 13, గుంటూరులో 4, కడపలో 3, నెల్లూరులో 2, అనంతపురంలో 1 కేసు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 525కు చేరింది.

తాజాగా నమోదైన కేసులతో కర్నూలు కూడా వంద మార్క్ అందుకుంది. ఇప్పటికే గుంటూరులో వందకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కర్నూలులో కూడా వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం గుంటూరులో 122 కేసులు, కర్నూలులో 110 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో నెల్లూరు, కృష్ణా, ప్రకాశం ఉన్నాయి. ప్రస్తుతం 491 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక మరణాల విషయానికొస్తే.. కృష్ణా, కర్నూలు, నెల్లూరులో కొత్తగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు కృష్ణాలో నలుగురు, గంటూరులో నలుగురు, కర్నూలు, నెల్లూరు, అనంతపురంలో చెరో ఇద్దరేసి చొప్పున కరోనా కారణంగా మృతిచెందారు.

మరోవైపు జిల్లాల వారీగా హాట్ స్పాట్స్ జాబితాను రిలీజ్ చేసింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో హాట్ స్పాట్స్ ను గుర్తించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,933 కు చేరింది.

చిరు అడుగుజాడల్లో హీరో శ్రీకాంత్