అమెరికాలో కరోనా మృత్యుఘోష

కరోనా దెబ్బకు “అగ్రరాజ్యం” అమెరికా వణికిపోతోంది. రోజూ వేలల్లో మరణాలు సంభవిస్తుంటే దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, వైద్యులు, ఔషధాలు.. ఇలా అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ మరణాల్ని తగ్గించడం…

కరోనా దెబ్బకు “అగ్రరాజ్యం” అమెరికా వణికిపోతోంది. రోజూ వేలల్లో మరణాలు సంభవిస్తుంటే దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, వైద్యులు, ఔషధాలు.. ఇలా అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ మరణాల్ని తగ్గించడం అమెరికా వల్ల కావడం లేదు. నిన్న ఒక్కరోజే అమెరికాలో 2569 మంది చనిపోవడం ఆ దేశం దయనీయ స్థితికి అద్దం పడుతోంది.

మంగళవారం అర్థరాత్రి నుంచి నిన్న అర్థరాత్రి వరకు కేవలం 24 గంటల్లో అమెరికాలో 2569 మంది మృత్యువాతపడ్డారు. ఒకే రోజులో ఇంతమంది చనిపోవడం అమెరికాలో ఇదే అత్యథికం. మొన్నటిమొన్న  2,407 మరణాలే ఒకరోజు అత్యథికం అనుకుంటే.. ఈసారి ఏకంగా 2569 మంది చనిపోవడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

తాజా మరణాలతో అసలు అమెరికాలో ఏం జరుగుతోందనే ప్రశ్న ప్రపంచాన్ని అటువైపు తిరిగేలా చేసింది. తాజా మరణాలతో అమెరికాలో మొత్తం మృతుల సంఖ్య 28,529కు చేరింది. నిన్న ఒక్క రోజే 30,206 కేసులు నమోదు కాగా.. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,089కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే.. అమెరికాలో మాత్రం రోజురోజుకు ఈ వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా న్యూయార్క్ లో కరోనా విలయం ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. న్యూయార్క్ లో రోజూ వందల సంఖ్యలో మరణిస్తున్నారు.

ఇటలీలో ఇప్పటివరకు 21,645 మంది, స్పెయిన్ లో 18,812 మంది, ఫ్రాన్స్ లో 17,167 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. ఇప్పటివరకు 20,84,595 మంది కరోనా బారిన పడగా.. వీళ్లలో 1,34,677 మంది మరణించారు. 

నీ మనవడు దేవాన్ష్ ని తెలుగు మీడియంలో చేర్పించు