పటిష్టమైన చర్యలు చేపట్టారు. భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలకు అనుమతినిచ్చారు. ర్యాండమ్ గా పరీక్షలు కూడా చేస్తున్నారు. చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని పూర్తిగా దర్శనాలకు అడ్డుకున్నారు. మరోవైపు శానిటైజేషన్ ప్రక్రియను భారీ ఎత్తున చేపడుతున్నారు. కొంతమంది ఉద్యోగుల్ని, కుటుంబాలకు దూరంగా కొండపైనే విడిగా ఉంచి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా మాత్రం కొండను వీడలేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటివరకు 80 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీళ్లతో పాటు వీళ్లతో టచ్ లోకి వచ్చిన వాళ్లందర్నీ క్వారంటైన్ కు తరలించారు.
ప్రతి రోజూ 200 మంది టీటీడీ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలా ఇప్పటివరకు 800 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా… అందులో 80 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే భక్తుల ద్వారా ఉద్యోగులకు కరోనా సోకినట్టు ఆధారాల్లేవు అంటున్నారు అధికారులు.
భక్తుల నుంచి ఉద్యోగులకు కరోనా సోకిందా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పుడు దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఉద్యోగుల నుంచి ముప్పు పొంచి ఉందనే విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో మరోసారి టీటీడీ దర్శనాల్ని నిలిపివేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం అలాంటి అవసరం లేదంటున్నారు.
అటు తిరుపతితో పాటు చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అలిపిరి వద్ద పూర్తిస్థాయిలో తనిఖీ ప్రక్రియలు, శానిటైజేషన్ పూర్తయిన తర్వాత వాహనాల్ని, వ్యక్తుల్ని, భక్తుల్ని కొండపైకి అనుమతిస్తున్నారు.