ఏపీలో నిన్న సాయంత్రం ఆరు గంటలకు తేలిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 303. అంతకు 24 గంటల ముందు నుంచి మొత్తం 51 కేసులు కరోనా పాజిటివ్ గా తేలాయని తెలుస్తోంది. ఇలా మొత్తం నంబర్ 303కు చేరింది. ఇందులో గమనించాల్సిన అంశం ఏమిటంటే.. మొత్తం కరోనా పేషెంట్లలో తబ్లిగీ వాటా 90 శాతానికి పైనే!
ఏపీలో కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో తబ్లిగీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారి ఇళ్లలోని వారిని కలిపితే మొత్తం 280 మంది! ఢిల్లీలోని ఆ మర్కజ్ కరోనాను వ్యాపింపజేయడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో అయితే రిజిస్టర్ అయిన 90 శాతం కేసుల్లో తబ్లిగీ మూలాలు తేలాడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.
ఆ మర్కజ్ లో కరోనా రోగులతో రాసుకుపూసుకు తిరిగిన వారికే ప్రధానంగా కరోనా అంటుకుంది. ఒకవేళ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కమ్ముకుంటున్న వేళ ఆ మత సంస్థ ఆ కార్యక్రమాన్ని చేపట్టకపోయి ఉంటే.. ఏపీ వంటి రాష్ట్రంలోనే గాక దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఏపీలో అయితే కొత్తగా రిజిస్టర్ అవుతున్న కేసులన్నీ కూడా తబ్లిగీ బ్యాచ్ లోనే కావడం గమనార్హం.
ఎవరో కొందరు చేసే పనికి అందరూ భయాందోళనలకు గురి కావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో కొంత ఊరటను ఇచ్చే అంశం ఏమిటంటే.. కరోనా పాజిటివ్ గా తేలుతున్న వాళ్లంతా మర్కజ్ బ్యాచ్, వాళ్ల ఇళ్లలోని వాళ్లే కావడంతో.. కరోనా కమ్యూనిటీ ట్రాన్స్ ఫర్ కాలేదా? అనేది. ప్రస్తుతానికి ఇంకా అది కూడా ప్రశ్నార్థకమే.