చిన్నమ్మకు పెద్ద పీట?

బీజేపీలో ఒక్కసారిగా ఎన్టీయార్ తనయ కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ప్రాధాన్యత పెరిగిపోయింది. ఆమె ఆరేళ్ళ క్రితం బీజేపీలో చేరారు. ఆమెని జాతీయ మహిళా మోర్చాలో కీలక నేతగా నాడు తీసుకున్నారు. Advertisement…

బీజేపీలో ఒక్కసారిగా ఎన్టీయార్ తనయ కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ప్రాధాన్యత పెరిగిపోయింది. ఆమె ఆరేళ్ళ క్రితం బీజేపీలో చేరారు. ఆమెని జాతీయ మహిళా మోర్చాలో కీలక నేతగా నాడు తీసుకున్నారు.

ఇక ఈ మధ్యన జాతీయ స్థాయిలో పార్టీలో జరిగిన మార్పులలో చిన్నమ్మకు ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. దాంతో ఏపీ బీజేపీలో ఆమె హవా ఒక్కసారిగా పెరిగింది అంటున్నారు.

విశాఖపట్నంలో తాజాగా  బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. దానికి వేదిక విశాఖలోని పురంధేశ్వరి నివాసం కావడం ఇక్కడ విశేషం. విశాఖలోని ఆమె ఇంట్లోనే పార్టీకి చెందిన పెద్దలంతా భేటీ అయి రాష్ట్ర బీజేపీ ఫ్యూచర్ గురించి సీరియస్ గా చర్చించారు అంటే అది ఆమెకు ఇచ్చిన గౌరవంగానే భావించాలి అంటున్నారు.

రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రా మీద ఫోకస్ పెడుతున్న బీజేపీ అదే స్థాయిలో ఎన్టీయార్ లెగసీని కూడా తమ వైపు తిప్పుకోవాలని ఆరాటపడుతోంది. దాంతో అనూహ్యంగా పురంధేశ్వరికి పార్టీలో పెద్ద పీట వేస్తున్నారు అంటున్నారు. 

ఇవన్నీ చూస్తూంటే మరో మారు విశాఖ నుంచి చిన్నమ్మ ఎంపీగా పోటీ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

గెరిల్లా యుద్దమే చేయాలి