ఏబీఎన్ మన సీబీఎన్ కి శకుని మామ

వెన్నుపోటనగానే తెలుగువారికి చంద్రబాబే గుర్తొస్తాడు కానీ మహాభారతంలో కూడా ఒక వెన్నుపోటుదారుడున్నాడు. స్వపక్షంలో ఉన్నట్టుగా నటిస్తూ ఆ పక్షాన్నే సర్వనాశనం చేసాడు… వాడే శకుని.  Advertisement కౌరవనాశనం కోసం జీవితాంతం మేనల్లుళ్ల మీద కపటప్రేమ…

వెన్నుపోటనగానే తెలుగువారికి చంద్రబాబే గుర్తొస్తాడు కానీ మహాభారతంలో కూడా ఒక వెన్నుపోటుదారుడున్నాడు. స్వపక్షంలో ఉన్నట్టుగా నటిస్తూ ఆ పక్షాన్నే సర్వనాశనం చేసాడు… వాడే శకుని. 

కౌరవనాశనం కోసం జీవితాంతం మేనల్లుళ్ల మీద కపటప్రేమ నటిస్తూ చివరకి వాళ్లని మట్టికరిపించి తానూ మట్టికరిచాడు. 

ఇంతకంటే వివరంగా ఆ కథ రాయట్లేదిక్కడ. “శ్రీకృష్ణపాండవీయం” సినిమాలో ఆ ఘట్టాన్ని చాలా వివరంగా చూపించారు. ఆసక్తుంటే చూసి తెలుసుకోవచ్చు. 

ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణకి, చంద్రబాబు నాయుడికి అలాంటి అవినాభావసంబంధమే ఉన్నట్టనిపిస్తోంది. చంద్రబాబు ఎన్.టి.ఆర్ కి వెన్నుపోటు పొడిస్తే ఇప్పుడు రాధాకృష్ణ చంద్రబాబుకి పొడుస్తున్నాడు. 

ఒక్కటే తేడా ఏంటంటే అది వెన్నుపోటని పొడుస్తున్నవాడికి, పొడిపించుకుంటున్నవాడికీ తప్ప మిగిలిన అందరికీ తెలియడం.

కాస్త గతంలోకి వెళ్లి చూస్తే కమ్మసామాజిక వర్గం గురించి తెదేపా స్థాపించడానికి ముందు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఎన్.టి.ఆర్, ఏ. ఎన్.ఆర్ తెర మీద రాజ్యమేలుతున్నా వారిని కులాలకి అతీతంగా అందరూ ఆరాధించారు. ఆమాటకొస్తే క్యాస్ట్ ఫీలింగ్ అప్పట్లో లేదనే చెప్పాలి. 

ఎప్పుడైతే ఎన్.టి.ఆర్ తెదేపా స్థాపించారో ఒక్కసారిగా “మనోడు” కాన్సెప్ట్ మొదలయింది. రాష్ట్రంలోని ఔత్సాహిక కమ్మజనులంతా నిజంగానే ఆ “మనోడు” ఫీలింగుతో పార్టీని భుజాలమీద మోసారు. అప్పటికీ ఎవరికీ ఇబ్బందనిపించలేదు. ఆ ఐకమత్యాన్ని చూసి గొప్పగా చెప్పుకున్నారే తప్ప తప్పుబట్టలేదు. 

ఇక క్రమంగా పంచన చేరిన చంద్రబాబు ఎప్పుడైతే ఎన్.టి.ఆర్ ని వెన్నుపోటు పొడిచాడో అప్పటి నుంచీ “మనోడు” కాన్సెప్ట్ కాస్తా “మనోడు మాత్రమే” స్థాయికి మారింది. అంటే “మనోళ్లే ఎదగాలి” అనే కాన్సెప్ట్. దానికి చంద్రబాబు పూర్తిగా గేట్లెత్తేసాడు. 

పర్యవసానంగా విద్యారంగం, వైద్యరంగం, వ్యాపారం, రాజకీయం, ఇంకా చెప్పకూడని కొన్ని కీలకమైన రంగాల్లో ఆ కులం వారే పాగా వేసి ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టారు. 

రాష్ట్రంలో పలు పల్లెటూళ్లల్లో రెండు వర్గాల మధ్య ఏదైనా డిస్ప్యూట్ వస్తే పోలీసులు కూడా ఒకే కులానికి చెందిన పెద్దని పిలిచి పంచాయితీ పెట్టించేవారు. ఆ పెద్ద ఏం తీర్పు చెబితే అది పోలీసులు అమలు చేసేవారు. ఈ వార్తలు పేపర్లో రావు. ఆయా ఊళ్లల్లో ఉన్న జనానికే అనుభవమిది. 

ఇవన్నీ క్రమంగా ఆ వర్గమ్మీద అసహ్యం పుట్టేలా చేసాయి. 

ఇలాంటివెన్ని జరుగుతున్నా తెలుగువాడంటే తెలుగుదేశానికి జై అనాల్సిందే అన్నంత రేంజులో ప్రోపగాండా చేసారు. 

ఇక్కడే మన కలియుగశకుని ఏబీఎన్ ఎంట్రీ ఇచ్చాడు. 

“చచ్చినోడి కళ్లు చారిడేసి” అన్నట్టుగా చంద్రబాబు ఏం చేసినా, చేయకపోయినా అతన్నొక చాణక్యుడిగా చూపించే ప్రయత్నం చేసాడు ఏబీఎన్. హైటెక్ సిటీ రావడానికి నేదురుమల్లి జనార్దనరెడ్డి కారణమైతే దానిని కాలక్రమంలో సైలెంటుగా చంద్రబాబు అకౌంట్లో వేసి ఊకదంపుడు వార్తలు రాసి అబద్ధాన్ని నిజం చేసేసాడు. పాపం పిచ్చిమారాజులాగ ఆ అబద్ధపు రాతలు చదివి చదివి చంద్రబాబు కూడా అవన్నీ నిజమని నమ్మి లేని సొంత గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. 

ముఖ్యమంత్రి హోదాలో సాధారణంగా జరిగే కొన్ని అంశాలని కూడా చంద్రబాబు కాబట్టే చేస్తున్నాడంటూ డబ్బా కొట్టాడు. 

మిగిలిన ముఖ్యమంత్రులకి ఆ డబ్బా వాయింపు చేతకాదు కాబట్టి, కొట్టే వాళ్లూ లేరు కాబట్టి రాష్ట్రంలో ఒక్క ఏబీఎన్ డప్పే వినపడేది. 

అన్నిటికీ వెనకేసుకొస్తూ, మచ్చుకి ఒక్క విమర్శ కూడా చేయకుండా చంద్రబాబుని గారాబం చేసి అతన్నొక మతిలేని మొద్దబ్బాయిగా మార్చేసాడు ఏబీఎన్. 

నిజానికి చంద్రబాబు గురించి పత్రికల్లో చదివి అందరూ అతనిని మేథావనుకుంటారు కానీ అతనితో దగ్గరగా పని చేసిన వారికి అతనిలో స్వార్థం, అవకాశవాదం, వల్లమాలిన పుత్రప్రేమ మాత్రమే కనిపిస్తాయని చెబుతారు. 

తప్పక ప్రాపకం కోసం ఆ పార్టీలో కూర్చున్నవారు మాత్రమే అతని గురించి ఏబీఎన్ టైపులో గొప్పగా డబ్బా కొడతారు తప్ప నిజానికి మ్యాటరేం లేదని వారికి కూడా తెలుసంటారు. 

చిత్రమేంటంటే ఈ ఏబీఎన్ ఉచ్చులో బాబుతో పాటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్లంతా పడ్డారు. 

వేలంవెర్రి వెర్రితలలేసేలాగ హమ్మర్ కార్లేసుకుని అమెరికాలో ర్యాలీలు నిర్వహించారు తెదేపాకి 40 ఏళ్లొచ్చాయని. మొన్నామధ్య “అఖండ” కి కూడా ఈ వర్గాలు ఈ రేంజ్ హడావిడే చేసాయి. 

తెదేపా పుట్టకముందు ఎక్కడున్నారో కూడా తెలియని ఆ వర్గం ఇప్పుడు ఉన్మాదుల్లా రోడ్ల మీద తిరుగుతున్నారంటే దానికి కారణం తొలుత ఈనాడు, తర్వాత ఏబీఎన్ ఎక్కించిన పిచ్చే. 

ఈ చేష్టలు మిగిలిన కులాలవారికి వెగటు పుడుతున్నాయని, అదే వారి ప్రాబల్యాన్ని మంటకలుపుతున్నాయని వారు గ్రహించకపోవడం దారుణం. 

ఇలాంటివి చేసే 2019 లో తెదేపా గూబ పగలగొట్టించేసారు తెలుగుతమ్ముళ్లూ, వారికి ప్రచారం కల్పించిన ఏబీఎన్ కలిసి. 

ఎంత డబ్బుంటే ఇంతిలా స్వకులమర్దనం కోసం తగలేస్తున్నారో ఈ వర్గం అని తటస్థులు కూడా నెవ్వెరబోతున్నారు. ఒకప్పుడు ఐకమత్యంలా కనిపించిన అంశం ఇప్పుడు “అతిగాళ్ల అట్టహాసం” లా కనిపిస్తోంది. 

ఏం చేస్తాం. అంతా శకునిమామ నిర్వాకం. ఆ ట్రాపులో బాబుతో పాటు బాబులంతా పడ్డారు. పసుపుపచ్చ కాస్తా పసుపుపిచ్చగా మారిందిప్పుడు. తెదేపాని పూర్తిగా భూస్థాపితం చేసేదాకా తప్ప ఏబీఎన్ ఆగేట్టులేదు. ఈ ఏబీఎన్ ఇలాగే క్రమం తప్పకుండా గొయ్యి తవ్వుతుంటే తెదేపా 50వ వార్షికోత్సవం జరుపుకోవడం కష్టమే. 

– నరేష్ ఎన్