మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. మంత్రి గౌతమ్ మృతితో అధికార పార్టీ షాక్‌కు గురైంది. ఈ నేపథ్యంలో గౌతమ్ మృతికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.
అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం చావులు కోరుకుంటున్న తరుణంలో గౌతమ్ మృతిపై అచ్చెన్నాయుడి సంతాప ప్రకటన గౌరవంగా ఉంది. గౌతమ్ హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసింది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయంగా మరింతగా ఎదగాల్సిన నాయకుడిని మృత్యువు కబళించిందని వాపోయారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరితో గౌతమ్ కలిసిపోయేవారని అచ్చెన్న అభిప్రాయపడ్డారు. గౌతమ్ ఎంతో హూందాగా ప్రవర్తించేవారని ప్రశంసించారు.
ప్రజాప్రతినిధిగా ప్రజలకు గౌతమ్‌రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు అచ్చెన్నాయుడు ప్రగాడ సానుభూతి తెలిపారు.
ఇదిలా వుండగా వైసీపీ ప్రముఖులు గౌతమ్‌కు నివాళులర్పించేందుకు హైదరాబాద్‌కు వెళుతున్నారని సమాచారం. ఆయన మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలోని ఆయన స్వస్థలానికి తీసుకెళ్లే అవకాశాలున్నాయి.