అచ్చెన్న నోట ఆణి ముత్యాలు

నిజమే  నేతలుగా ఉన్న వారు చెప్పాల్సిన నీతులు ఇవే.  జనాలకు నాయకత్వం వహిస్తూ అనుభవం గడించిన వారి నోటి వెంట ఇలాంటి మాటలే రావాలి. కానీ గడచిన అయిదేళ్ల తెలుగుదేశం ఏలుబడిలో మంత్రిగా పనిచేసిన…

నిజమే  నేతలుగా ఉన్న వారు చెప్పాల్సిన నీతులు ఇవే.  జనాలకు నాయకత్వం వహిస్తూ అనుభవం గడించిన వారి నోటి వెంట ఇలాంటి మాటలే రావాలి. కానీ గడచిన అయిదేళ్ల తెలుగుదేశం ఏలుబడిలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల మీద ఎంతలా రెచ్చిపోయారో అందరూ చూశారు.

ఆనాడు విపక్ష వైసీపీని టీడీపీ సర్కార్ పెట్టిన బాధలు వేసిన కేసులూ కూడా ఇప్పటికీ తలచుకుంటారు. మరి నాడు అధికారం శాశ్వతం అని అచ్చెన్నాయుడు, చంద్రబాబు అనుకున్నారో ఏమో మరి. అయితే కళ్ళకు కట్టిన గంతలు దించేసి మరీ కుర్చీని దిగలాగేశాక కానీ ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటో టీడీపీ పెద్దలకు తెలిసింది కాదు.

ఇపుడు అచ్చెన్నాయుడు అదే చెబుతున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అంటున్నారు. ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలని కోరుతున్నారు. తమ పార్టీ నేతల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంతకు ఇంతా చక్రవడ్డీలతో సహా చెల్లించి తీరుతామని భీకర గర్జనలే చేస్తున్నారు.

నిజమే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు కానీ మరి నాడు విర్రవీగింది ఎవరు, తప్పుడు కేసులు పెట్టింది ఎవరు,  గెలిచిన ఎమ్మెల్యేలు ఉండగా వారిని కాదని ఓడిన వారిని ఇంచార్జిలుగా చేసింది ఎవరు, ఇవన్నీ సీనియర్ నేతలుగా ఉన్న అచ్చెన్న లాంటి వారు ఆలోచించుకుంటే మంచిది. 

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు ఓడలు బళ్ళు అవుతాయి. అందుకే మిడిసిపడకూడదు అంటారు. ఇపుడు అచ్చెన్న వల్లిస్తున్న మాటలు గతంలో ఎక్కడో విన్నట్లుంది  అనుకుంటే  మాత్రం అది గత అయిదేళ్ళ పాలనా పాపం అని ఒకసారి  తలచుకుంటే చాలు.

సొంత పరువు కూడా బాబుకి తాకట్టు