భయం లేదంటూనే భయపడ్తున్నారెందుకు.

తెలుగుదేశం పార్టీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌ చేయడం అనేది ప్రస్తుత రాజకీయాల్లో చాలా చాలా సహజమైన విషయం. చంద్రబాబు హయాంలో వైఎస్సార్సీపీని ఏ స్థాయిలో టార్గెట్‌ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాంతో…

తెలుగుదేశం పార్టీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌ చేయడం అనేది ప్రస్తుత రాజకీయాల్లో చాలా చాలా సహజమైన విషయం. చంద్రబాబు హయాంలో వైఎస్సార్సీపీని ఏ స్థాయిలో టార్గెట్‌ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాంతో పోల్చితే, వైఎస్‌ జగన్‌ పెద్దగా టీడీపీపై ‘దృష్టి’ పెట్టినట్లు అన్పించదు. లేకపోతే, చంద్రబాబు ఈపాటికే ప్రతిపక్ష నేత హోదా కోల్పోయేవారు. చంద్రబాబులా పార్టీ ఫిరాయింపులకు వైఎస్‌ జగన్‌ దిగితే.. పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో చంద్రబాబు పదే పదే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ‘దొంగా.. దొంగా..’ అనడం చూశాం. అంతలా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, చంద్రబాబు పాలనలో తీవ్రమైన మానసిక వ్యధ అనుభవించారు. మరి, దానికి బదులు తీర్చుకోవాలి కదా.? అలా కేవలం ‘బదులు’ తీర్చుకోవాలనే ఆలోచనే వైఎస్‌ జగన్‌ చేస్తే.. పరిస్థితులు ఇంకోలా వుండేవి. కానీ, వైఎస్‌ జగన్‌ కాస్త ‘పద్ధతి’గా వ్యవహారాల్ని నడిపిస్తున్నారు.

అమరావతి కేంద్రంగా చంద్రబాబు హయాంలో భారీ దోపిడీ జరిగిందని వైసీపీ మొదటి నుంచీ ఆరోపిస్తూనే వుంది. అందుకు తగ్గ ఆధారాల్ని అప్పట్లోనే బయటపెట్టింది. ఆ ఆధారాలకి తోడు, తాము అధికారంలోకి వచ్చాక జరిపించిన అంతర్గత విచారణలతో వెలుగు చూసిన మరికొన్ని ఆధారాల్ని బేస్‌ చేసుకుని ‘సిట్‌’ని ఏర్పాటు చేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఇంకేముంది.? తెలుగుదేశం పార్టీ భుజాలు తడుముకునే పని షురూ చేసింది.

‘మాకేం భయం లేదు..’ అంటూనే, టీడీపీ నేతలు వణికిపోతున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. భయం లేనప్పుడు, కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే మాత్రం.. టీడీపీ నేతలకెందుకు అంత అసహనం. టీడీపీ హయాంలో అవినీతి జరగకపోతే, ‘సిట్‌’ అయినా చేసేదేమీ వుండదు. ఒకవేళ అక్రమాలు వెలుగు చూస్తే మాత్రం అంతే సంగతులు. టీడీపీ భయపడుతున్న తీరు చూస్తోంటే, తమ హయాంలో అక్రమాలకు పాల్పడింది నిజమేనని టీడీపీ ఒప్పుకున్నట్లే అవుతుంది కదా.!

అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వస్తే.. ‘బీసీల మీద ప్రభుత్వం’ దాడి.. అంటూ టీడీపీ యాగీ చేస్తోంది. చంద్రబాబుని విమర్శిస్తే, మొత్తం కమ్మ సామాజిక వర్గాన్ని వైసీపీ టార్గెట్‌ చేసినట్లవుతుందట. ఏంటీ కుల రాజకీయం.? ఎందుకీ భయం.?

అంతా మోడీ చెప్తేనే చేసాను.. నా తప్పు లేదు