అచ్చెన్నకు అలవాటు అయిపోయింది కానీ…?

ఉత్తరాంధ్రాలో టీడీపీకి పెద్ద దిక్కు కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయనని గత ఏడాది ఈఎస్ఐ స్కాం లో అరెస్ట్ చేశారు. ఆ తరువాత మళ్ళీ తాజాగా అరెస్ట్ చేశారు. తన సొంత గ్రామం నిమ్మాడలో వైసీపీ…

ఉత్తరాంధ్రాలో టీడీపీకి పెద్ద దిక్కు కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయనని గత ఏడాది ఈఎస్ఐ స్కాం లో అరెస్ట్ చేశారు. ఆ తరువాత మళ్ళీ తాజాగా అరెస్ట్ చేశారు. తన సొంత గ్రామం నిమ్మాడలో వైసీపీ అభ్యర్ధి అప్పన్న నామినేషన్ ని వ్యతిరేకించడంతో అచ్చెన్న ప్రమేయం కూడా ఉందని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ అరెస్ట్ ను అచ్చెన్న ఊహించినదే. ఆ మాటకు వస్తే చంద్రబాబుకు కూడా ఇలా అరెస్ట్ చేస్తారని తెలుసు. కానీ దీనికి ముందు జరిగిన గొడవను మరచిపోయి  ఊరికే అచ్చెన్నను అరెస్ట్ చేశారంటూ పెద బాబూ చినబాబూ గగ్గోలు పెడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

నిమ్మాడలో నాలుగు దశాబ్దాలుగా పంచాయతీ ఏకగ్రీవం అవుతోంది. అక్కడ కింజరాపు ఫ్యామిలీదే రాజ్యం. అక్కడ ఎన్నిక ఉండదు అంటారు. అటువంటి చోట రెండవ వైపు వైసీపీ అభ్యర్ధి నిలబడి నామినేషన్ వేస్తే అచ్చెన్నాయుడు ఆయన వర్గీయులు ఊరుకుంటారా. జరగాల్సిన రచ్చ అంతా జరిగింది. ఏకంగా ఒక పోలీస్ అధికార్ ఫ్యాంట్ కూడా ఈ వివాదంతో చిరిగింది.

ఇక వైసీపీ టెక్కలి ఇంచార్జి దువ్వాడ శ్రీనివాస్ తో పాటు అభ్యర్ధి అప్పన్న మీద కూడా దాడి జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. తనపైన అచ్చెన్న వర్గీయులు హత్యాయత్నం చేశారని ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు కంప్లైట్ ఇచ్చాక అచ్చెన్న అరెస్ట్ కాకుండా ఉంటాడా. ఆయనకూ ఈ అరెస్టులు అలవాటు అయ్యాయి. 

ఇక నానా యాగీ చేసి అరెస్టుల దాకా కధ నడపడం కూడా టీడీపీ ప్లాన్ అని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి అచ్చెన్న అరెస్ట్ తో ఉత్తరాంధ్రా సెంటిమెంట్, శాంతి భద్రతలను ముడిపెట్టి చంద్రబాబు హాట్ కామెంట్స్ చేయడమే కొసమెరుపు.

ఎందుకు పెదవి విప్పాలి?

జగన్ కు వచ్చిన నష్టం ఏమిటి?