అశోక్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన వైసీపీ సర్కార్ ?

విజయన‌గరం సంస్థనాధీశుడు, పూసపాటి వారి వారసుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ మధ్య సేవ్ మాన్సాస్ అంటూ జనంలోకి వచ్చారు. ఆయనకు మద్దతుగా టీడీపీ సంతకాల సేకరణ ఉద్యమాన్ని కూడా చేపట్టింది.…

విజయన‌గరం సంస్థనాధీశుడు, పూసపాటి వారి వారసుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ మధ్య సేవ్ మాన్సాస్ అంటూ జనంలోకి వచ్చారు. ఆయనకు మద్దతుగా టీడీపీ సంతకాల సేకరణ ఉద్యమాన్ని కూడా చేపట్టింది.

మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు మీద అశోక్ నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఆమెకు రాజుల కోటతో ఏంటి సంబంధం అంటున్నారు. మాన్సాస్ గౌరవం, మర్యాద పోతోందని, ఆస్తులు, భూములు పోతున్నాయని గగ్గోలు పెట్టారు.

వీటికి సంచయిత ధీటుగానే స్పందించింది. బాబాయ్ కి గట్టిగానే కౌంటర్లు వేసింది. ఇపుడు ఆమెకు మరింత మద్దతుగా వైసీపీ సర్కార్ నిలిచింది. ఏకంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 104 దేవాలయాలకు కూడా చైర్ పర్సన్ గా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

దీంతో పూసపాటి వారసుల పోటీలో సంచయిత మరింత అగ్రభాగానికి చేరుకున్నారు. ఇప్పటికే ఆమె సింహాచలం,  మాన్సాస్ ట్రస్టులకు చైర్ పర్సన్ గా ఉంటున్నారు.  తాజాగ మరో 104 దేవాలయాల‌కు చైర్ పర్సన్ గా నియమితులు కావడంతో ఆమె హవా ఒక్కసారిగా పెరిగింది.

గతంలో ఆనంద్, తరువాత అశోక్ కూడా 104 దేవాలయాలకు చైర్మన్లుగా ఉండేవారు. ఇపుడు సంచయితను ప్రభుత్వం పూసపాటి వారసురాలిగా గుర్తించడంతో తండ్రి, బాబాయ్ తరువాత ఆమె ఈ హోదాను సాధించిన వారు అయ్యారు. 

మొత్తానికి అశోక్ కు మద్దతుగా టీడీపీ యాగీ చేస్తున్న వేళ చాలా సైలెంట్ గా వైసీపీ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుని పెద్దాయనకు షాక్ ఇచ్చేసింది.

అశోక్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన వైసీపీ సర్కార్ ?