కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియ అత్తమామలు కిరణ్‌నాయుడు, మురళినాయుడు సోమవారం తెల్లవారుజామున పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ తల్లిదండ్రులు హైదరాబాగ్ శ్రీనగర్ కాలనీలో మహాత్మాగాంధీ పేరుతో ఇంటర్నేషన్ స్కూల్ నడుపుతున్నారు.
ఈ స్కూల్ పై అంతస్తులో ఇల్లు ఉంది. కిడ్నాప్‌నకు ముందు దుండగులకు ఈ స్కూల్‌లోనే 15 రోజుల పాటు భార్గవ్‌రామ్ తల్లి, తమ్ముడు ఐటీ అధికారులుగా ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇచ్చారు.
అలాగే ప్రవీణ్‌రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేసిన తర్వాత మొదట స్కూల్ వద్దకే తీసుకెళ్లారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా భార్గవ్‌రామ్ తల్లిదండ్రులను కనీసం విచారించని పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున శ్రీనగర్‌లో భార్గవ్‌రామ్ తల్లిదండ్రులున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో తమను అరెస్ట్ చేస్తారనే భయానికి లోనైన భార్గవ్ తల్లిదండ్రులు పోలీసుల కళ్లుగప్పి కారులో పరారయ్యారు.
ప్రస్తుతం ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లో దర్జాగా ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, ఇప్పుడు తీరిగ్గా వెళ్లగా, వాళ్లు పరారు కావడం గమనార్హం.