కార్యకర్తలందరూ మంత్రులేనట

జీవిత కాలం కోరిక తీరిపోతే అలాగే ఆనందం పెల్లుబుకుతొంది.  రాజకీయాల్లోకి వచ్చిన ప్రతీవారికీ మంత్రి కావాలని ఉంటుంది. ముత్తంశెట్టి శ్రీనివాస్ కి పదేళ్ళకే ఆ కోరిక తీరింది. అది కూడా ఏడాది పాలన పూర్తి…

జీవిత కాలం కోరిక తీరిపోతే అలాగే ఆనందం పెల్లుబుకుతొంది.  రాజకీయాల్లోకి వచ్చిన ప్రతీవారికీ మంత్రి కావాలని ఉంటుంది. ముత్తంశెట్టి శ్రీనివాస్ కి పదేళ్ళకే ఆ కోరిక తీరింది. అది కూడా ఏడాది పాలన పూర్తి అయింది. గొడవలూ ఘోషలు అంతకంటే లేవు.

గ్రూపులూ వివాదాలు కూడా ఏమీ లేవు. దాంతో మంత్రి గారి ఆనందానికి అవధులు లేవు. ఈ ఊపులో ఆయన ఏడాది మంత్రిగా సంబరాలు చేసుకున్నారు. తాను మంత్రిని కావడం, అది ఏడాది కాలం జరిగిపోవడం అంతా ఒక కలగా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.

తాను మాత్రమే మాత్రమే మంత్రిని కానని వైసీపీలోని ప్రతీ కార్యకర్త కూడా మంత్రేనని కూడా ఆ ఆనందంలో ప్రకటించేశారు. అందరూ పార్టీలో సమానమేనని, అవకాశాలు ఎవరికి వచ్చినా కూడా అది అందరివీ అంటూ కొత్త భాష్యం చెప్పారు.

మొత్తానికి మంత్రిలో కొత్త సంతోషం తొణికిసలాడుతోంది. గతంలో టీడీపీ హయాంలో  ఇద్దరు మంత్రులు విశాఖ జిల్లాకు ఉండేవారు. దాంతో ఎన్నో వివాదాలు, వర్గ పోరు ప్రతీ రోజూ రచ్చగానే ఉండేది. వైసీపీ హయాంలో అది లేకపోవడమే కాదు, విశాఖ వంటి పెద్ద జిల్లాకు మంత్రిగా ముత్తంశెట్టి ఉండడంతో ఆయన చాలా హ్యాపీగా ఉంటున్నారు. మరి మంత్రిగా ఎన్నో చేశామని చెబుతున్న ముత్తంశెట్టి ఇదే హుషార్ లో అయిదేళ్ల మంత్రిగా ప్రమోట్ అయ్యేలా చూసుకోవాలి అంటున్నారు అభిమానులు.

తమ్ముడు అలా.. అన్న ఇలా

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు