నువ్వు కూడా బూతులో కలిసిపోయావా అరవిందూ!

ప్రస్తుతం వెబ్ సిరీస్ లన్నీ బూతుమయమైపోయాయి. డైలాగుల్లో బూతులు, సన్నివేశాల్లో బూతులు, తెరిస్తే అడల్ట్ కంటెంట్. అసలు ఇవి లేకపోతే వెబ్ సిరీస్ చేయడం వేస్ట్ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇప్పుడీ లిస్ట్ లోకి…

ప్రస్తుతం వెబ్ సిరీస్ లన్నీ బూతుమయమైపోయాయి. డైలాగుల్లో బూతులు, సన్నివేశాల్లో బూతులు, తెరిస్తే అడల్ట్ కంటెంట్. అసలు ఇవి లేకపోతే వెబ్ సిరీస్ చేయడం వేస్ట్ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇప్పుడీ లిస్ట్ లోకి అల్లు అరవింద్ కూడా చేరిపోయాడు.

కొంతమంది ఎగ్జైటింగ్ పార్టనర్స్ (సీక్రెట్ భాగస్వాములు అని కూడా అనుకోవచ్చు) తో కలిసి ఆహా అనే యాప్ ను లాంఛ్ చేశాడు అరవింద్. తొలి తెలుగు ఓటీటీ వేదిక కావడంతో కాస్త సెన్సిబుల్, ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని అంతా భావించారు. కానీ అరవింద్ మాత్రం తగ్గలేదు. అన్ని వెబ్ సిరీసుల్లానే తన యాప్ లో కంటెంట్ ను కూడా బూతుతో నింపేశాడు. అంతేకాదు, ఆ విషయాన్ని ఘనంగా ప్రకటిస్తున్నాడు కూడా.

తమ యాప్ లో కంటెంట్ బోల్డ్ గా ఉంటుందని, పేరంటల్ కంట్రోల్ పెట్టుకోవాలని సూచిస్తున్నాడు. పిల్లలకు తమ మొబైల్స్ ఇచ్చినప్పుడు, టీవీలో తమ యాప్ పెట్టుకున్నప్పుడు ఈ “కంట్రోల్” తప్పనిసరిగా ఉంచుకోవాలని తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాడు. తమ యాప్ లో కంటెంట్ బోల్డ్ గా ఉంటుందని చెప్పడానికి సిగ్గుపడనని కూడా తనకుతానుగా ప్రకటించేసుకున్నాడు.

ప్రస్తుతం యాప్స్ లో కంటెంట్ బూతు చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తయారైంది. అవసరం ఉన్నా లేకపోయినా అర్థగంటకు ఓ సీన్ పెట్టేయడం ఆనవాయితీగా మారింది. ఇక డైలాగ్స్ అయితే దారుణం. అలా కేవలం ఓ సెక్షన్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమైపోయాయి ఓటీటీ యాప్స్ అన్నీ. మొట్టమొదటి తెలుగు ఓటీటీ ఆహా, దానికి భిన్నంగా సాగుతుందని.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ తమది కూడా బూతు మార్గమే అని ఓపెన్ గా చెప్పాడు అల్లు అరవింద్.

ఇక భాగస్వాముల విషయానికొస్తే.. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో చాలామంది ఎగ్జయిటింగ్ పార్టనర్స్ ఉన్నారంటున్నాడు అల్లు అరవింద్. వాళ్లందర్నీ ఉగాది రోజున అందరికీ పరిచయం చేస్తానంటున్నాడు.

రాజమండ్రి లో 'దిశ' తొలి పోలీస్‌ స్టేషన్‌