చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ ను ఎప్పుడో కెలికేశాడు. రీసెంట్ గా రిలీజ్ డేట్ వ్యవహారంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ను కూడా కెలికాడు. ఇక బన్నీ-ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవలకు హద్దే లేదు. ఇలా బన్నీకి ఇతర హీరోల ఫ్యాన్స్ తో ఉన్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు వాళ్లందర్నీ కూల్ చేసే విధంగా అల వైకుంఠపురములో ఓ సీక్వెన్స్ పెట్టాడు అల్లు అర్జున్..
మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమాలో పాటను అల వైకుంఠపురములో సినిమాలో ఓ సందర్భంలో వాడుకున్నారు. అదే సన్నివేశానికి కొనసాగింపుగా తారక్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో పాటను కూడా వాడారు. ఈ రెండు సందర్భాల్లో సీన్ లో అల్లు అర్జున్ కనిపిస్తాడు.
ఇక్కడితో ఆగలేదు అల్లు అర్జున్. పబ్లిక్ ఫంక్షన్లలో ఎవరి పేరునైతే ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడడో అతడి సినిమా పాటను కూడా వాడాడు. అవును.. పవన్ నటించిన హిట్ సినిమా పాటను వాడుకోవడంతో పాటు ఏకంగా ఆ పాటకు బన్నీ స్టెప్పులు కూడా వేయడం విశేషం. సిచ్యుయేషన్ డిమాండ్ చేయడం లేదు, అయినా మీ అందరి కోసం అంటూ పవన్ పాటను ఇరికించారు.
ఇన్ని చేసిన బన్నీ, చిరంజీవిని వాడకుండా వదులుతాడా. చిరంజీవి హిట్ సాంగ్ కు కూడా స్టెప్పులు వేశాడు. చూడ్డానికి ఇది అత్తారింటికి దారేదిలో అహల్య ఎపిసోడ్, గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి సీక్వెన్స్ ను తలపించినప్పటికీ.. ఇది కూడా బాగుంది. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ తో అటు పవన్ ఫ్యాన్స్ తో పాటు ఇటు మహేష్, ఎన్టీఆర్ అభిమానుల్ని కూడా చల్లార్చే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్.