మళ్ళీ రాజధాని ఊసు…ఏం జరుగుతోంది బాసూ?

విశాఖ రాజధాని ముచ్చట మూడు బిల్లుల సాక్షిగా ఆగిపోయినట్లే. అసెంబ్లీలో బిల్లులను రద్దు చేసుకుంది వైసీపీ సర్కార్. దాని మీద విపక్షాలు అయితే ఆనందంగా ఉన్నాయి. అమరావతే అసలైన రాజధాని అవుతుంది అని కూడా…

విశాఖ రాజధాని ముచ్చట మూడు బిల్లుల సాక్షిగా ఆగిపోయినట్లే. అసెంబ్లీలో బిల్లులను రద్దు చేసుకుంది వైసీపీ సర్కార్. దాని మీద విపక్షాలు అయితే ఆనందంగా ఉన్నాయి. అమరావతే అసలైన రాజధాని అవుతుంది అని కూడా గట్టిగా సౌండ్ చేశాయి.

ఇక వైసీపీ నేతలు ఈ విషయంలో పెద్దగా ఇప్పటివరకూ మాట్లాడలేదు. అయితే లేటెస్ట్ గా ఆ పార్టీ ఎమ్మెల్యే గుడి గుడివాడ అమరనాధ్ అయితే విశాఖకు రాజధాని వచ్చి తీరుతుంది అంటూ పక్కాగా క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో రెండవ మాటకు అవకాశమే లేదు అంటూ చెప్పారు.

విశాఖ రాజధానికి కట్టుబడి ఉన్నామని తేల్చేశారు. విశాఖ రాజధానికి టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వకుండా ఉత్తరాంధ్రాకే ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. ఆ విధంగా ఈ ప్రాంతానికి తాము వ్యతిరేకమవుతున్నామని గ్రహించే స్టీల్ ప్లాంట్ మీద లేని పోని ప్రేమను ఒలకబోస్తున్నారని అన్నారు.

అయితే అది సరిగ్గా చేసి కేంద్రాన్ని నిలదీయకుండా వైసీపీని టార్గెట్ చేయడం ద్వారానే వారి అసలు విషయం బయటపడిందని అన్నారు. మొత్తానికి గుడివాడ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తూంటే విశాఖ రాజధానికి కౌంటర్ గానే స్టీల్ ప్లాంట్ మీద విపక్షాలు వైసీపీని కార్నర్ చేస్తున్నాయని తెలుస్తోంది

దాంతో మళ్ళీ విశాఖ రాజధాని ప్రస్థావన తేవడం ద్వారా విపక్షాలను ఇరకాటంలో పెట్టాలని వైసీపీ ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ విశాఖ రాజధాని అన్నది ఉందా. అసలు అ కధ ఎంత దాకా వచ్చింది బాసూ అంటున్నారు సగటు జనం. 

చూడాలి మరి ఈ కౌంటర్ అటాక్స్ కి పొలిటికల్ కామెంట్స్ కి మాత్రమే వైజాగ్ క్యాపిటల్ పరిమితం అవుతోందా అన్న డౌట్లు అయితే అందరిలో వస్తున్నాయి.