అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న పోస్ట్ కొవిడ్ సమస్యలు

కరోనా వస్తే పడే ఇబ్బందుల కంటే.. అది తగ్గిపోయిన తర్వాత వచ్చే సమస్యలే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోస్ట్ కొవిడ్ ప్రాబ్లమ్స్ తో అమెరికా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. అగ్రరాజ్యంలో వచ్చిన మొత్తం కరోనా కేసుల్లో…

కరోనా వస్తే పడే ఇబ్బందుల కంటే.. అది తగ్గిపోయిన తర్వాత వచ్చే సమస్యలే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోస్ట్ కొవిడ్ ప్రాబ్లమ్స్ తో అమెరికా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. అగ్రరాజ్యంలో వచ్చిన మొత్తం కరోనా కేసుల్లో 23 శాతం మంది పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దాదాపు 20 లక్షల మంది హెల్త్ ఇన్సూరెన్స్ రికార్డులు పరిశీలించగా ఈ విషయం బయటపడింది.

కరోనా తర్వాత వచ్చే సమస్యలేంటి..?

గతేడాది కొవిడ్ బారినపడి కోలుకున్నవారిలో చాలామంది నెల, రెండు నెలల తర్వాత కొత్త సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. వీరిలో వయోభేదం కూడా లేదు. చిన్నపిల్లలు కూడా కరోనా తగ్గిన తర్వాత సైడ్ ఎఫెక్టులతో ఇబ్బంది పడుతున్నారు.

కండరాలు నొప్పులు, నరాల సమస్యలు, శ్వాస ఇబ్బందులు, కొలస్ట్రాల్ లెవర్స్ అమాంతం పెరిగిపోవడం, అలసట, నిద్రలేమి, రక్తపోటు పెరిగిపోవడం, గుండె సమస్యలు… ఇలా కరోనా వచ్చిపోయిన తర్వాత చాలామందిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని సమస్యలు కరోనా నుంచి కోలుకున్నవారిని చుట్టుముడుతున్నాయి.

విచిత్రం ఏంటంటే వీరిలో చాలామందిని అసలు కరోనా ఇబ్బంది పెట్టలేదు, అది పోయిన తర్వాత వచ్చిన సమస్యలతోనే వీరు సతమతం అవుతున్నారు. పోస్ట్ కొవిడ్ సమస్యలు చుట్టుముట్టినవారిలో 19 శాతం మందికి అసలు తమకు కరోనా వచ్చినట్టు కూడా తెలియదు. 

అసింప్టమాటిక్ కేసులు అవన్నీ. ఇప్పుడు కొత్త సమస్యలతో ఆస్పత్రులకు వెళ్తే.. కరోనా వచ్చి తగ్గిపోయిందని దానివల్లే ఆరోగ్య సమస్యలు తలెత్తాయని డాక్టర్లు చెప్పడంతో ఆశ్చర్యపోవడం వారి వంతయింది.

ఇక 27 శాతం మంది స్వల్ప లక్షణాలతో బాధపడినవారు కూడా కరోనా తగ్గిన తర్వాత ఇతర అనారోగ్యాల పాలవుతున్నారు. మొత్తమ్మీద అమెరికా వాసుల్ని పోస్ట్ కొవిడ్ సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.