చంద్రబాబు తన కలల రాజధాని అమరావతి గురించి ఇప్పటిదాకా ఎన్ని మాటలు విన్నారో. పాపం… ఇంకా ఎన్ని వినాలో ఏమో ఒక విధంగా మహా స్వాప్నికుడు చంద్రబాబుకు వాస్తవాలు కళ్ళెదుట కనిపిస్తూ ఇంకా బాధపెడుతున్నాయి కాబోలు.
అమరావతి రాజధానికి ట్రాన్సిట్ క్యాపిటల్ గా కొత్త పేరు పెట్టారు మంత్రి సీదరి అప్పలరాజు. ఇది వింటే చంద్రబాబు బాధపడాతారేమో కానీ మంత్రి గారి మాటల్లో కూడా లాజిక్ ఉందిగా. పైగా అక్కడ నిర్మించినవి అన్నీ కూడా టెంపరరీ అనే చంద్రబాబు పదే పదే చెప్పేవారు అని కూడా మంత్రి గుర్తు చేస్తున్నారు.
ఇక అమరావతి ప్రజల రాజధాని కానే కాదని ఆయన అంటున్నారు. అది కొంతమంది గుప్పిట పట్టిన ప్రాంతం మాత్రమేనని కూడా సూత్రీకరిస్తున్నారు. వారి ప్రయోజనాల కోసం ఏపీ ప్రజల మొత్తం గొంతు కోయాలా అని కూడా ఆయన నిలదీస్తున్నారు.
అమరావతి పేరిట చంద్రబాబు చేయిస్తున్న ఉద్యమాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. మొదట 29 గ్రామాలు అన్నారు, ఆ తరువాత ఇది గ్రామ స్థాయికి పడిపోయిందని కూడా మంత్రి హాట్ కామెంట్స్ చేశారు.
అధికార వికేంద్రీకరణ వల్లనే మొత్తం ప్రజనీకానికి ప్రయోజనం చేకూర్తుంది తప్ప ఎక్కడో కొందరి కోసం రాజధాని కడతామంటే కుదిరే పని కాదని కూడా అప్పలరాజు అంటున్నారు. అమరావతిలో పెద్ద నగరమే నిర్మాణం అయిందన్న భ్రాంతిని తాను పొందుతూ జనాలను చంద్రబాబు మభ్యపెడుతున్నారనికూడా అయన ఆరోపించారు.
ఇందులో వామపక్షాలు కూడా చిక్కుకోవడమే వింతా విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించడం విశేషమే. మొత్తానికి అమరావతి పేరిట బాబు ఇకనైనా పెయిడ్ ఉద్యమాలు ఆపాలని మంత్రి అప్పలరాజు డిమాండ్ చేస్తున్నారు.