నందమూరి బాలకృష్ణ ఏం చేసినా కాస్త సంచలనమే. కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఉన్నట్లుండి శివశంకరి పాటను పాడేసి విడుదల చేసారు.
ఎవ్వరు ఏమనుకుంటేనేం తను అనుకున్నది తాను చేస్తారు. అలాగే ఏనాడో పక్కన పెట్టిన నర్తనశాల ప్రాజెక్టులోని ఫుటేజ్ ను బయటకు తీసి, శ్రేయాస్ ఏటిటిలో విడుదల చేస్తున్నారు. దీనికి ఓ రెగ్యులర్ ఫుల్ లెంగ్త్ సినిమాకు చేసినంత హంగామా చేస్తున్నారు.
ఇదిలా వుంటే బాలయ్య నుంచి రెండు షాకింగ్ విడుదలలు వున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి బాలయ్య పాడిన ఇంగ్లీష్ పాట. ఇటీవల బాలయ్య తన ముచ్చట తీర్చుకోవడం కోసం ఓ ఇంగ్లీష్ పాటను కోరస్ తో కలిపి ఆలపించారని, దానిని సోషల్ మీడియాలోకి వదిలే ప్రయత్నల్లో వున్నారని తెలుస్తోంది.
శివశంకరి ఎంత హడావుడి చేసిందొ, ఎన్ని కామెంట్ లకు నోచుకుందో తెలిసిందే. ఇప్పుడు ఇక ఈ ఇంగ్లీష్ పాట వస్తే ఇంకెలా వుంటుందో చూడాలి.
ఇక రెండో ముచ్చట ఏమిటంటే, నర్తనశాల విడియో ఫుటేజ్ సందర్భంగా బోలెడు పబ్లిసిటీ మెటీరియల్ వదిలారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి విడియో బైట్ వీటిల్లో ఒకటి. నర్తనశాలకు ఎస్వీ కృష్ణారెడ్డికి ఏమిటి? సంబంధం? ఇప్పుడు ఈయనెందుకు సీన్లోకి వచ్చారు అని అందరికీ డౌట్ వచ్చింది. దానికి సరైన ఆన్సర్ వుంది.
నర్తనశాల విడియో ఫుటేజ్ లో చివర్న బాలయ్య-సౌందర్య నటించిన టాప్ హీరోలో సాంగ్ బిట్ ను యాడ్ చేసారని తెలుస్తోంది. ఈ సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి డైరక్టర్ అన్న సంగతి తెలిసిందే.
ఆ సినిమాలో టోపీ పెట్టుకుని బాలయ్య చేసే 'ముద్దుపాప..ఓ ముద్దుపాప' పాట బిట్ యాడ్ చేసారని తెలుస్తోంది. మొత్తం మీద ఈ దసరా బాలయ్య ఫ్యాన్స్ కు సందడే సందడి.