రాథేశ్వామ్…కలర్ ఫుల్ ట్రీట్

బాహుబలి ఫ్రభాస్ అప్ కమింగ్ మూవీ రాథేశ్వామ్ నుంచి మోషన్ పోస్టర్ బయటకు వచ్చింది. ఈ టీజర్ ఎలా వుండబోతోందో గ్రేట్ ఆంధ్ర రెండు రోజులు ముందే (https://telugu.greatandhra.com/movies/movie-gossip/radhe-shyam-teaseradbhutaha-112412.html) వెల్లడించిన సంగతి తెలిసిందే.  Advertisement ఇప్పుడు…

బాహుబలి ఫ్రభాస్ అప్ కమింగ్ మూవీ రాథేశ్వామ్ నుంచి మోషన్ పోస్టర్ బయటకు వచ్చింది. ఈ టీజర్ ఎలా వుండబోతోందో గ్రేట్ ఆంధ్ర రెండు రోజులు ముందే (https://telugu.greatandhra.com/movies/movie-gossip/radhe-shyam-teaseradbhutaha-112412.html) వెల్లడించిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు మోషన్ పోస్టర్ ను బయటకు వదిలారు. ఆద్యంతం గ్రాఫిక్స్ తోనే పోస్టర్ ను తయారు చేసారు. కానీ చేసిన గ్రాఫిక్స్ చాలా డిటైల్డ్ గా, కలర్ ఫుల్ గా, కళ్లకు ఇంపుగా వున్నాయి. ఓ మాంచి గ్రాఫిక్స్ త్రీ డీ మూవీ టీజర్ చూసిన ఫీలింగ్ ను కలిగించింది. 

ఓ మోషన్ పోస్టర్ ను త్రీడీ విడియో మాదిరిగా తయారుచేసి వదలడం ఇదే తొలిసారి అనుకోవాలి. టీజర్ లో విజువల్స్ అన్నీ గ్రాండ్ గా కలర్ ఫుల్ గా వున్నాయి. సినిమా థీమ్ అయిన పామిస్ట్రీ, రొమాంటిక్, లవ్ స్టోరీని పోస్టర్ లో స్మూత్ గా వెల్లడించారు.  

పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో విడుదలవుతున్న రాధేశ్వామ్ కు తెలుగులో గోపీకృష్ణా మూవీస్, యువి క్రియేషన్స్ నిర్మాతలు. హీందీలో టీసిరీస్ ఈ సినిమాను అందిస్తోంది.