ముంబయ్‌పై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఘడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ చేసిన ట్వీట్ తీవ్ర కలకలం రేపుతోంది. ఆ ట్వీట్‌లో ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముంబయ్‌పై ఈ స్థాయిలో ఇంత తీవ్రంగా మాట్లాడిన వారు లేరు. అందుకే ఆమె మాటలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి భార్య అన్న మాటలు రాజకీయ రంగు పులుముకున్నాయి.
ముంబయ్ తన మానవత్వాన్ని కోల్పోయిందన్న ఒక్క ఘాటు మాట ప్రత్యర్థులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య , దానిపై ముంబయ్ పోలీసుల వ్యవహార శైలే అమృత ఫడ్నవిస్‌కు అసహనం తెప్పించింది. సుశాంత్ ఆత్మహత్య కేసులో బిహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముంబయ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే బతకడానికి ముంబై మహానగరం ఎంత మాత్రం సురక్షితం కాదనే అనుమానం కలుగుతోందని అమృత అన్నారు. ఇక్కడ అమాయక ప్రజలు, ఆత్మగౌరవం ఉన్నవారు జీవించడం సురక్షితం కాదని మాజీ ముఖ్యమంత్రి భార్య ట్వీట్ చేశారు.
అమృత ఫడ్నవిస్ ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. అసలే బీజేపీ వర్సెస్ శివ సేన, కాంగ్రెస్, ఎన్సీపీ అన్నట్టు మహారాష్ట్రలో రాజకీయ సమీకరణలు మారాయి. దీంతో బీజేపీ ప్రత్యర్థి పార్టీలైన శివసేన ఎన్సీపీ నాయకులు ముంబయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అమృతపై మండిపడుతున్నారు.
ఆమె ట్వీట్ అభ్యంతరకరంగా ఉందంటూ ఖండించారు. శివసేన రాజ్యసభ సభ్యుడు ప్రియాంక చతుర్వేదీ స్పందిస్తూ అమృత ఫడ్నవిస్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. బీజేపీ నాయకులు రాజకీయం చేస్తూ ముంబై పోలీసుల పరువు తీసేలా మాట్లాడు తున్నారని మండిపడ్డారు. ముంబయ్ పోలీసులపై నమ్మకం లేనప్పుడు తమ భద్రత కోసం ప్రైవేట్ సిబ్బందిని నియమించుకో వాలని సూచించారు. మహారాష్ట్రను పాలించిన మాజీ సీఎం భార్యగా అమృత ఫడ్నవిస్ పోలీసులను నిందించటం సిగ్గు చేట న్నారు. ఇది ముంబయ్ పోలీసుల ఆత్మవిశ్వాసాన్ని, మహానగర వ్యక్తిత్వాన్ని కించపరచడమే అని ఆయన అభిప్రాయపడ్డారు.