Advertisement

Advertisement


Home > Politics - Analysis

1989 లో ఏం జ‌రిగింది బాబూ?

1989 లో ఏం జ‌రిగింది బాబూ?

కింజ‌రాపు ఎర్రం నాయుడు. గొప్ప నాయకుడు అంటూ తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నిన్నటికి నిన్న కొనియాడారు. ఆ విధంగా బిసిలను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. బాగానే వుంది. ఎర్రం నాయుడు సోదరుడు, కొడుకు ఇద్దరూ ఇప్పుడు తెలుగుదేశంలోనే కీలక స్థానాల్లో వున్నారు. మంచిదే. 

కానీ చరిత్ర మరిచిపోకూడదు. ఇదే ఎర్రం నాయుడుకు 1989 లో తెలుగుదేశం పార్టీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు. చంద్రబాబును అంటి పెట్టుకుని వుంటూ వచ్చిన ఎర్రం నాయుడును, అతని మిత్రుడు గౌతు శివాజీ ని ఎందుకు 1989 లో పార్టీ దూరం పెట్టింది? చంద్రబాబు పని కట్టుకుని ఆ ఇద్దరినీ గెలవకుండా చేయాలని ఎందుకు ప్రయత్నించారు?

అప్పుడే కదా కామన్ సింబల్ మీద ఎర్రం నాయుడు, శివాజీ స్వంతంత్ర ఎమ్మెల్యేలుగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థుల మీద గెలిచింది. అంతే కాదు, గెలిచి మళ్లీ తెలుగుదేశం పంచన చేరకుండా అయిదేళ్ల పాటు కాంగ్రెస్ అసోసియేట్ సభ్యులుగా కొనసాగారు ఇద్దరూ. ఎర్రం నాయుడును, శివాజీని ఓడించడానికి ఎన్నికల టైమ్ లో చంద్రబాబు గట్టిగా ప్రయత్నంచారు.

ట్విస్ట్ ఏమిటంటే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పార్టీ నేతగా గౌతు శివాజీ కూతురు శిరీష లీడ్ చేస్తుంటే, రాష్ట్ర స్థాయిలో ఎర్రం నాయుడు సోదరుడు అచ్చెం నాయుడు పార్టీని లీడ్ చేస్తున్నారు. అప్పట్లో ఎర్రం నాయుడు, శివాజీ పోటీ చేసింది ఏనుగు గుర్తు మీద. అందుకే అంటారేమో ఏనుకు బతికినా, మరణించినా గ్రేట్ అని. 

ఇప్పుడు నిన్నటికి నిన్న ఎర్రం నాయుడును గ్రేట్ అని స్మరిస్తూ చంద్రబాబు ఇండైరెక్ట్ గా బిసి లకు ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. అదీ విషయం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?