అనిల్ సుంకర నిర్మించిన భారీ సినిమా ఏజెంట్. అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి అందిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మీద కాస్త మంచి అంచనాలు వున్నాయి. కానీ భారీ బడ్జెట్ కారణంగా సినిమా కాస్త ఇబ్బందుల్లోనే వుంది. ఈ నేపథ్యంలో సినిమా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక హక్కులను నిర్మాత అనిల్ సుంకర హోల్ సేల్ గా అమ్మేసారు. చాలా మంచి రేటు వచ్చింది. సినిమాను జిఎస్టీ కాకుండానే 34 కోట్లకు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక కలిపి అమ్మేసారు.
విశాఖకు చెందిన గాయత్రీ ఫిలింస్ సతీష్ ఈ హక్కులను పోటీ పడి కొనుగోలు చేయడం విశేషం. చాలా మంది 30 నుంచి 32 కోట్ల మేరకు కోట్ చేసినా, సతీష్ 34 కోట్లకు ఆఫర్ ఇచ్చేసి తీసుకున్నారు. పైగా జిఎస్టీ కూడా కట్టడానికి ఓకె అన్నారు. కచ్చితంగా నిర్మాత అనిల్ సుంకర కు ఇది భారీ ఆఫర్ నే.
కానీ విషయం ఏమిటంటే అంతా బాగానే వుంది, ఇంత రేటు వచ్చినా, నాన్ థియేటర్ బాగానే వచ్చినా 15 కోట్ల మేరకు డెఫిసిట్ తో ఏజెంట్ సినిమాతో విడుదల అవుతుంది. దీనికి ఒకే ఒక్కరు కారణం..దర్శకుడు సురేందర్ రెడ్డి.
సినిమాను భారీగా చెక్కడం, ఇప్పటికీ ఇంకా షూట్ చేస్తూ వుండడంతో భారీగా వర్కింగ్ డేస్ పెరిగిపోయాయి. ఖర్చూ పెరిగిపోయింది. కొంతలో కొంత ఇలా మంచి రేట్లు రావడం వల్ల నిర్మాత బయటపడ్డట్టే.