Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఆ ఒక్క హామీ ఇవ్వగలరా?

ఆ ఒక్క హామీ ఇవ్వగలరా?

వరాలు ప్రకటించడం వేరు. అమలు చేయడం వేరు. తెలుగుదేశం పార్టీ అనుకుల మీడియా పదే పదే వైకాపా నవరత్నాల పథకాల మీద విమర్శలు కురిపించేది ఈ యాంగిల్ లోనే. కొద్ది మందికి మాత్రం ఇస్తున్నారని,  హడావుడి ఎక్కువ అని అనడం కామన్. ఏ పథకం అయినా అర్హులు.. అనర్హులు అనే రెండు కేటగిరీలు ఎప్పుడూ వుంటారు. మేనిఫెస్టోలో ఇలాంటివి ముందుగానే ప్రకటిస్తే ఏ సమస్యా వుండదు. కానీ అలా ప్రకటిస్తే ఓట్లు రాలవు

తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చింది. ఇన్నాళ్లూ జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, ప్రజల్ని సోమరుల్ని చేస్తున్నారు అంటూ వస్తున్న, చేస్తున్న విమర్శలు వుండగానే తెలుగుదేశం పార్టీ ఈ స్కీములు ప్రకటించడం విశేషం.

ప్రతి మహిళకు, అంటే 18 నుంచి 59 ఏళ్ల వరకు మధ్యలో వున్న వారికి నెలకు 1500 వందలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే 60 దాటిన వారికి 2500 నుంచి 3000 పింఛను వస్తోంది. ఈ లోపు వారికి ఇదో తరహా పింఛను అనుకోవాలి. 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలు అంటే ఏదో ఒక పని చేసుకుంటూనే వుంటారు. కానీ వాళ్లకి కూడా పింఛను కాని పింఛను ప్రకటించడం అంటే కేవలం ఓట్ల కోసం తప్ప మరేమిటి అనుకోవాలి?

పైగా ఇప్పుడు అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. పల్లెటూరి అమ్మాయిలు కూడా డిగ్రీ వరకు పక్కాగా చదువుకుంటున్నారు. అంటే వాళ్లు ఎక్కడ ఏ దుకాణంలో పని చేసినా పది నుంచి పదిహేను వేలు సంపాదించుకోగలరు. అలాంటిది వాళ్లకు నెలకు 1500 ఇవ్వడం అంటే ఏమనుకోవాలి. 

అది అలా వుంచితే ఆంధ్రలో 18 నుంచి 59 మధ్య వయసున్న మహిళల సంఖ్య ఎంత వుంటుంది. ఎన్ని కోట్ల మంది వుంటారు. నెలకు ఎంత అవుతుంది. మరి అప్పుల బారిన పడకుండా దీనిని ప్రతి నెలా భరించగలరా? అంటే కచ్చితంగా ఏదో లిమిటేషన్ వుండనే వుంటుంది. తెల్లకార్డు వున్నవాళ్లే అర్హులు అనో, కుటుంబానికి ఒకరికే అనో ఇలా వుంటాయి. అవి ముందుగా చెప్పకుండా ఇలా ప్రతి మహిళకు అని చెప్పడం ద్వారా ఓట్లు రాబట్టడం తప్ప వేరు ఉద్దేశం కాదు.

నిరుద్యోగ భృతిని కూడా మేనిఫెస్టోలో చేర్చారు. నెలకు మూడు వేలు ఇస్తామన్నారు. కానీ అర్హత క్రెటీరియా ఏమిటో చెప్పలేదు. పల్లె నుంచి పట్నం వరకు ఏ ఒక్క కుర్రాడు ఖాళీగా వుండడం లేదు. అసలు అన్ స్కిల్డ్ కార్మికులు దొరకడమే లేదు. అలాంటపుడు నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి అన్నదే హాస్యాస్పదం. పాన్ కార్డ్ ద్వారి లింక్ చేసిన బ్యాంక్ స్టేట్ మెంట్ తీస్తే ఏ కుర్రాడూ నిరుద్యోగిగా కనిపించమన్నా కనిపించడు.

ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయి వుంది. ఏ రాయితీల వల్ల వచ్చిన లోటునూ ఏ ప్రభుత్వాలూ ఎప్పుడూ భర్తీ చేసిన దాఖలా లేదు. ఇక ఇప్పుడు మొత్తం మహిళలకు ఆర్టీసీలో జిల్లా వ్యాప్తంగా ఫ్రీ అంటే ఏమనుకోవాలి? కేంద్రం వున్న రాయతీలే ఎత్తేస్తోంది. రాష్ట్రం ఇస్తున్న రాయతీలు సరి కాదని ఇప్పటికే మేధావులు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాటికి మరికొన్ని జోడిస్తా అంటోంది.

‘’ప్రయివేటు భాగస్వామ్యంతో సంపద సృష్టిస్తాం… సృష్టించిన సంపదను పేదలకు పంచిపెడతాం..’’ ఇది కూడా దేశం మానిఫెస్టోలో మాటనే. దీనికి అర్థం ఏమిటి? ఎలా అన్నది చెప్పే నాధుడు ఎవరూ లేరు. చంద్రబాబు చెప్పినా మనకు అర్థం కాదు. ప్రయివేటు భాగస్వామ్యంతో సంపద సృష్టి అంటే రాష్ట్ర ఆదాయం పెరగడం అని అనుకోవాలి. అలా వచ్చిన ఆదాయం పేదలకు పంచుతాం అంటే ఇలాంటి స్కీముల ద్వారా అని అనుకోవాలేమో?

అసలు ఇవన్నీ కన్నా ఓ మాంచి హామీని మేనిఫెస్టోలో పెట్టగలిగితే తెలుగుదేశం పార్టీ నిజంగా రికార్డు సృష్టించినట్లు అవుతుంది.

తాము అధికారం చేపట్టే నాటికి వున్న అప్పులను రూపాయి కూడా పెరగనివ్వము అని..హామీ ఇవ్వగలగాలి. అప్పుడే ఇన్నాళ్లూ చేస్తూ వస్తున్న విమర్శలకు అర్థం వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?