అదిగో.. అల్లదిగో.. ఉమ్మడి కార్యాచరణ

జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మాటలు వేరు. చేతలు వేరు. మాటల రేంజ్‌లో చేతలు వుండి వుంటే ఈ పాటికే జనసేన అనేది ఓ ప్రధాన పక్షంగా మారివుండేది. వేరే పార్టీల పంచన చేరి పాతిక,…

జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మాటలు వేరు. చేతలు వేరు. మాటల రేంజ్‌లో చేతలు వుండి వుంటే ఈ పాటికే జనసేన అనేది ఓ ప్రధాన పక్షంగా మారివుండేది. వేరే పార్టీల పంచన చేరి పాతిక, ముఫై సీట్లు తీసుకునే పరిస్థితి వుండేది కాదు. 

ఓట్లు చీలనివ్వను అని ఎప్పటి నుంచో చెప్పుకు వస్తూన్న పవన్, ఉన్నట్లుండి తెలుగుదేశంతో కలిసే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అక్కడితో ఆగలేదు. ఉమ్మడి కార్యాచరణకు వెళ్తామని అన్నారు.

నిజానికి ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్‌తో పొత్తు అనౌన్స్ చేసిందే చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనలు తెలియచేయడానికి మందిని పోగేయడం కోసం. తెలుగుదేశం జనాలు రోడ్డు ఎక్కడం లేదని బంద్ పిలుపునాడే తెలిసిపోయింది. ఇప్పుడు అత్యుత్సాహంతో ఊగిపోతున్నది జనసైనికులే. అందువల్ల వాళ్ల ఉత్సాహాన్ని వాడుకోవాలని ప్లాన్ చేసారు. ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ అనే మంచి పదం వాడారు. అంత వరకు బాగానే వుంది.

కానీ ఇదంతా జరిగి వారం అయిపోతోంది కానీ ఆ కార్యాచరణే కనిపించడం లేదు. లోకేష్ వెళ్లి ఢిల్లీలో కూర్చున్నారు. అక్కడ చేస్తున్న పనులు ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. తొలిరోజు రెండు మూడు ఇంటర్వూలు, మలి రోజు చిన్న హడావుడి తప్ప మరేం లేదు. కేవలం అరెస్ట్ కు భయపడే, తండ్రి లోపల వుంటే, తల్లి ఒంటరిగా వుంటే, తాను అండగా వుండాల్సింది పోయి, శ్రేణులను ముందుండి నడిపించాల్సింది పోయి ఢిల్లీలో సైలంట్ గా వుండిపోయారు.

ఈ కారణంగానే ఈ ఉమ్మడి కార్యాచరణ అన్నది ఆలస్యమవుతోంది. పైగా ఈ ఉమ్మడి కార్యాచరణకు ఉమ్మడి కార్యాచరణ కమిటీ అన్నది ఫార్మ్ చేయాల్సి వుంది. దీనికి ఇరు వైపులా కొన్ని పేర్లు కావాలి. లోకేష్‌నే ఆ పేర్లు ఫైనల్ చేయాలి. అక్కడ సమస్య లేదు. కానీ జనసేనకు కొన్ని పేర్లు కావాలి. ఎవరి పేర్లు ఇస్తే ఏమవుతుందో అన్న డౌట్ వుంది. అందువల్ల ఈ కమిటీ ఫార్మేషన్ కు కాస్త సమయం పట్టేలాగే వుంది.

కానీ ఇంతలో చంద్రబాబుకు కనుక బెయిల్ వస్తే ఇక బయట తిరగడం అన్నది ఆయన చూసుకుంటారు. ఇక్కడ ఇక ఉమ్మడి కార్యాచరణ అన్నది అవసరమే లేదు. పవన్ బాబు ఆయన షూటింగ్‌లు ఆయన చూసుకోవచ్చు. అప్పుడప్పుడు వారాహిని బయటకు తీస్తూ, జుట్టు ఎగరేస్తూ వుండొచ్చు.