Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఆలీతో ఆడుకుంటున్నదెవరు?

ఆలీతో ఆడుకుంటున్నదెవరు?

నటుడు ఆలీ వైకాపాను వీడి జనసేన లోకి వెళ్తున్నారని దాదాపు అన్ని మీడియాల్లో ఒకేసారి వార్తలు సర్రున వచ్చాయి. నిజానికి గత పది రోజులుగా ఆలీకి కీలకమైన పదవిని జగన్ ఇవ్వబోతున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తూ వచ్చింది. 

అలాంటి నేపథ్యంలో ఇలాంటి వార్తలు ఒక్క సారిగా షాక్ ఇచ్చాయి. పగలు అంతా ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆఖరికి సాయంత్రం వేళకు ఆలీ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇదంతా తనపై వైకాపా లో కొందరు చేస్తున్న కుట్ర అనే అర్థం వచ్చేలా స్టేట్ ఇచ్చారు.

వైకాపాలో ఇలాంటివి కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు కొందరు చేసారు. పృధ్వీ రాజ్ అయితే కొందరు తనను పని గట్టుకుని టార్గెట్ చేసారని ఓపెన్ గా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆలీ కూడా అదే చెప్పారు. అంటే జగన్ ఈ వ్యవహారం మీద కన్నేయాల్సిన సమయం వచ్చింది. 

ఎందుకంటే ఈ ప్రచారాలే నిజమైపోయి, కొందరు అవసరమైన వారిని, సమర్థులను అనవసరంగా పక్కన పెట్టడం, దూరం చేసుకోవడం చేయాల్సి వస్తే ఆ నష్టం జగన్..పార్టీకి తప్ప మరెవరికి కాదు. 

ఇదిలా వుంటే అసలు ఆలీ మీద రూమర్లు పుట్టించాల్సిన అవసరం ఎవరికి వుంటుంది? పార్టీలో మైనారిటీ వర్గానికి చెంది, అలాగే సినిమా నటుడిగా ప్రజల్లో బాగా గుర్తింపు వున్న నటుడు ఆలీ. మైనారిటీ వర్గాలు ఎవరూ అతనికి నెగిటివ్ చేయాలను కోరు. మరి ఇంకెవరు? ఎందుకు? అన్నది ఆరా తీయడం బెటర్. ఇలాంటివి మొదట్లోనే కట్ చేస్తే ఎన్నికల వేళ లేనిపోని తలనొప్పులు రాకుండా వుంటాయి.

ఏమైనా ఆలీ ఇచ్చిన స్టేట్ మెంట్ కూడా బాగుంది. పదవులు కీలకం కాదని చెప్పడానికి ఏమీ కానీ, జగన్ ను మరోసాసి సిఎమ్ గా చూడాలన్నదే తన లక్ష్యం అని చెప్పడం సరైన టార్గెట్ ను కొడుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?