cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Analysis

కమ్మ సామాజికవర్గంలో బాబు పరువు పోతోందా..?

కమ్మ సామాజికవర్గంలో బాబు పరువు పోతోందా..?

ఇటీవల జగన్ ఓ వ్యూహం ప్రకారం చంద్రబాబుని టార్గెట్ చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకుని రావాలనుకుంటున్నారని, దత్తపుత్రుడు లేనిదే బాబు లేడని, 2024 ఎన్నికలకు భయపడుతున్న బాబు, పవన్ పొత్తు కోసం వెంపర్లాడుతున్నారనే మెసేజ్ జనాల్లోకి పంపిస్తున్నారు. 

అది వాస్తవం కూడా. కానీ కమ్మ సామాజిక వర్గానికి బాబు అంత బలహీనుడవడం ఇష్టంలేదు. అందులోనూ కాపుల దయతో అధికారం కోసం వెంపర్లాట అనే కామెంట్ వారికి అస్సలు మింగుడు పడటం లేదు. దీంతో సమర్థత లేని నాయకుడిగా చంద్రబాబుపై ముద్రపడిపోయింది. కమ్మల్లో ఆయన ఇమేజ్ తగ్గుతోంది.

అన్నీ బాగానే ఉన్నప్పుడు సొంత కులమైనా, పరాయి కులమైనా హవా కొనసాగుతుంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారో, అప్పట్నుంచి బాబు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. 

ప్రస్తుతానికి చంద్రబాబు తోక పట్టుకుని వేలాడినా రేపు ఆయన కొడుకు లోకేష్ హయాంలో తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే విషయం ఇప్పటికే ఆ వర్గంలో అందరికీ తెలిసిపోయింది. 

సో.. ఫ్యూచర్ చూసుకున్నా కేవలం కులం పేరుతో ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే మరో ఆల్టర్నేట్ చూసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది కమ్మ సామాజిక వర్గం.

ఏడుపుతోనే అంతా పోయింది..

నాయకుడనేవాడు ఏడిస్తే, ఇక సైనికులు ఉసూరుమనక ఏం చేస్తారు. అయ్యయ్యో నా భార్యను తిట్టారు, నా కొడుకు పుట్టుకకు వంకపెట్టారంటూ చంద్రబాబు గుక్కపెట్టి ఏడ్చినరోజే ఆయన ఇమేజ్ బాగా దెబ్బతిన్నది. 

మా బ్లడ్డు, మా బ్రీడు అని చెప్పుకునేవారు దీన్ని సహించలేకపోయారు. ఇంత బతుకు బతికి.. ఇలా మీడియా ముందు గుక్కపట్టి ఏడవడం ఎందుకని అన్నారు కూడా. బాబుపై ఎవరీకీ నమ్మకంలేదు, ఆయన్ను నమ్ముకుంటే భవిష్యత్తూ లేదు. అందుకే పక్కదారి చూసుకుంటున్నారు.

ప్రస్తుతానికి నందమూరి నాయకత్వాన్ని వారు కోరుకుంటున్నా, నారావారు దానికి దారి దొరక్కుండా చేస్తున్నారు. పతనం పరిపూర్ణం అయితేనే కొత్త నాయకులు పుట్టుకొస్తారు. సో.. వీలైనంత మేర బాబుకి ఎడంగా ఉండటమే కమ్మనాయకులు ఇప్పుడు చేస్తున్న పని.

పదే పదే పవన్ కల్యాణ్ పేరు చెప్పుకోవాల్సి రావడం కూడా కమ్మలకు అస్సలు నచ్చడం లేదు. అధికారం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లయినా పట్టుకుంటారని అందరికీ తెలుసు. ఢిల్లీలో ఆయన ఏ ఛండాలం చేసినా ఎవరికీ పెద్ద పట్టింపుల్లేవు. 

ఇప్పుడు రాష్ట్రంలో పవన్ ని దేబిరిస్తుండే సరికి సొంత సామాజికవర్గమే బాబుని ఛీ కొడుతోంది. ఆమధ్య చంద్రబాబు, పవన్ కు చేసిన లవ్ ప్రపోజల్ తో ఈ చీదరింపు ఇంకాస్త ఎక్కువైంది. ఈ వ్యతిరేకత ముందు ముందు ఇంకెంత పెద్దగా మారుతుందో చూడాలి. 

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?