కాన్స్ చిత్రోత్సవంలో అదరగొడుతోంది పూజా హెగ్డే. రెడ్ కార్పెట్ పై హొయలు ఒలికించడంతో పాటు.. రకరకాల ఫొటో షూట్స్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా సాగర తీరంలో వైట్ డ్రెస్ తో ఈమె చేసిన ఫొటో షూట్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ ఫొటో షూట్ లో ఆమె వేసుకున్న వైట్ కలర్ డ్రెస్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
కాన్స్ ఫెస్టివల్ లో భాగంగా పూజా వేసుకున్న ఈ వైట్ డ్రస్ ఖరీదు అక్షరాలా లక్షా 15వేల రూపాయలు. చూడ్డానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఈ డ్రెస్ వెనక చాలా పెద్ద కథ ఉందంటున్నాడు ఆస్ట్రేలియాకు చెందిన డిజైనర్ టోనీ మేటిసెవ్ స్కీ. ఈ డ్రెస్ వేలాడినట్టు కనిపించదట.
ఓవైపు బాడీకి అతుక్కుపోయినట్టు కనిపిస్తూనే, మరోవైపు ఎద, మెడ భాగలో పెర్ ఫెక్ట్ డిజైనింగ్ ఇస్తుందట. అందుకే దీనికి ఇంత రేటు అంటున్నాడు. ఈ డ్రెస్ వేసుకుంటే జ్యూవెలరీ ఖర్చు ఉండదు. సింపుల్ గా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుందంటున్నాడు.
ఈ తెల్లటి దుస్తులతో, సాగరతీరంలో మెరిసింది పూజాహెగ్డే. అలా కాన్స్ లో తన టూర్ పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇండియాకు బయల్దేరింది. తిరిగి తన సినిమాలతో బిజీ అవ్వబోతోంది.
మరికొన్ని రోజుల్లో సల్మాన్ ఖాన్ తో కలిసి చేస్తున్న సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతోంది పూజ. సర్కస్ సినిమా ప్రమోషన్ కూడా మొదలుపెట్టబోతోంది. వీటితో పాటు మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు కూడా కాల్షీట్లు కేటాయించింది ఈ బుట్టబొమ్మ.