Advertisement

Advertisement


Home > Politics - Analysis

బుచ్చయ్యకు ‘మహానాడు’ గిఫ్ట్ ఇస్తుందా?

బుచ్చయ్యకు ‘మహానాడు’ గిఫ్ట్ ఇస్తుందా?

తెలుగుదేశం సీనియర్లలో ఒకరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మిగిలిన సీనియర్లు అంతా అటు ఇటుగా సైలంట్ అయినా బుచ్చయ్య మాత్రం డిజిటల్ టీమ్ ను పెట్టుకుని, సోషల్ మీడియాలో వైకాపా మీద రోజుకు రెండు మూడు సార్లు అయినా సెటైర్లతో విరుచుకుపడిపోతుంటారు. 

అదే సమయంలో తన నియోజకవర్గంలో జనాలతో కలిసి వుండడానికి విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. ఆయనకు రాజకీయ వారసులు లేరు. అందువల్ల ఈ ఏడు పదులు దాటిన వయసులో కూడా తానే పోటీ చేయాలి తప్ప వేరు కాదు. అందుకే ఈ వయసులో కూడా బుచ్చయ్య చౌదరి అంత కష్టపడుతున్నారు.

బాగానే వుంది. కానీ సమస్య ఏమిటంటే ఇదే రాజమండ్రి 2 నియోజకవర్గం మీద జనసేన కన్నేసింది. అక్కడ బలమైన అభ్యర్థిని సిద్దం చేసింది. తమ బేరసారాల్లో ఈస్ట్ లో పిఠాపురంతో పాటు ఈ సీటు కూడా కావాలని బలంగా డిసైడ్ అయి వుంది. మరి తెలుగుదేశం ఏం చేస్తుంది అన్నది సమస్య. 

ఇస్తే ఓ సమస్య.. ఇవ్వకుంటే మరో సమస్య. రెండు వైపుల నుంచి ఓట్ ట్రాన్సాఫార్మేషన్ అన్నది కీలకం. ఎవరికి ఇచ్చినా రెండో వైపు నుంచి నాన్ కోపరేషన్ తప్పదు.

ఇలాంటి నేపథ్యంలో రాజమండ్రిలో మహానాడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం ఏర్పాట్లను, మహనాడు బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నారు బుచ్చయ్య చౌదరి. ఇప్పుడు ఇదంతా ఆయన ఈ వయసులో ఎందుకు చేస్తున్నారో తెలియంది కాదు. మరి జనసేనను ఎలా ఒప్పించి, తప్పిస్తుందో అన్నది తెలుగుదేశం టాస్క్. 

తాను పడుతున్న కష్టానికి, తాను పెడుతున్న ఖర్చులకు మహానాడు నుంచి రాబోయే ఎన్నికల్లో టికెట్ రూపంలో బుచ్చయ్య చౌదరికి గిఫ్ట్ అందుతుందా అన్నదే ఆసక్తికరమైన విషయం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?