Advertisement

Advertisement


Home > Movies - Movie News

అపూర్వ స్నేహితుల కొత్త బ్యానర్

అపూర్వ స్నేహితుల కొత్త బ్యానర్

యువి సంస్థ విక్కీ (విక్రమ్), హీరో రామ్ చరణ్ ఇద్దరూ అపూర్వ స్నేహితుల టైపు. వీలైనంత వరకు ఇద్దరూ కలిసి వుండాల్సిందే. విక్కీ తన పనులు పక్కన పెట్టి కూడా రామ్ చరణ్ తో వుంటూ వుంటారు. అన్న వంశీ ప్రభాస్ కు స్నేహితుడు అయితే తమ్ముడు విక్కీ చరణ్ కు మిత్రుడు. వారి స్నేహాలు అంత అద్భుతంగా వుంటాయి.

ఇప్పుడు ఈ అపూర్వ స్నేహితులు ఇద్దరూ కలిసి వి మెగా పిక్చర్స్ అనే కొత్త బ్యానర్ ను స్టార్ట్ చేసారు. ఇప్పటికే విక్కీ-చరణ్ కలిసి ఎగ్జిబిషన్ సెక్టార్ లో కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది కొత్తది. 

ఈ కొత్త వి మెగా బ్యానర్ మీద తొలిగా అఖిల్ హీరోగా సినిమా రావచ్చు. అలాగే శ్రీవిష్ణు తో సినిమా ఒకటి కూడా వుంది. మెగాస్టార్ తో చేయబోయే సినిమాను మరి ఈ కొత్త బ్యానర్ మీదే చెేస్తారా లేదా అన్నది తెలియాల్సి వుంది.

యువి సంస్థలో విక్కీ-వంశీలతో పాటు ఫ్రభాస్ సోదరుడు ప్రమోద్ భాగస్వామి. ఇప్పుడు ఈ కొత్త సంస్థలో విక్కీ వున్నారు అంటే వంశీ కూడా వున్నట్లే. వారితో పాటు రామ్ చరణ్ కూడా భాగస్వామి. ఆదిపురుష్-సలార్ లాంటి భారీ సినిమాలను యువి సంస్థ తెలుగులో అందించబోతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?