Advertisement

Advertisement


Home > Politics - Analysis

చంద్రబాబు తో ‘మంచు’ ముచ్చట్లు

చంద్రబాబు తో ‘మంచు’ ముచ్చట్లు

ఆ ఇద్దరూ స్నేహితులు. ఆ ఇద్దరూ విరోధులు..ఆ ఇద్దరూ బంధువులు..ఆ ఇద్దరూ భాగస్వాములు..ఆ ఇద్దరూ ఒకే ప్రాంతం వారు. ఆ ఇద్దరే మంచు మోహన్ బాబు..నారా చంద్రబాబునాయుడు. 

ఇద్దరికీ మంచి స్నేహం వుంది. హెరిటేజ్ ప్రారంభించినపుడు భాగస్వామ్యం వుంది. ఇద్దరిదీ చిత్తూరు ప్రాంతమే. అలాంటి ఇద్దరూ ఇప్పటికి రెండు సార్లు విరోధులయ్యారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దించినపుడు ఒకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నపుడు మరోసారి.

కానీ ఆ తరువాత మళ్లీ కలిసారు. కానీ చిత్రంగా 2019లో మళ్లీ వేరయ్యారు. వైఎస్ జగన్ తో బంధుత్వం కూడా కలిసింది మోహన్ బాబు కుటుంబానికి. 2022 వరకు ఆ వేరు దారులు..ఈ బాంధవ్యాలు అలాగే వున్నాయి. కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. 

గత కొంత కాలంగా వైఎస్ జగన్ వైఖరి పట్ల మోహన్ బాబు అసంతృప్తితో వున్నారని వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఆ అసంతృప్తిని అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వ్యక్తం చేస్తూనే వున్నారు కూడా.

కోరి వైఎస్ జగన్ దగ్గరకు వెళ్లినా ఆయనేమీ అంత సమాదిరించలేదని వార్తలు వున్నాయి. పైగా జగన్ కు తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే. అదే సమస్య అయి వుండొచ్చు మంచు మోహన్ బాబుకు. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. 

నిజానికి ఆ మధ్య తాను ‘ఇక యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం’ అని మోహన్ బాబు ప్రకటించారు. మరి ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయి చంద్రబాబును కలిసి రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య వర్తమాన రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు కూడా వైఎస్ టైపే. ఎవరు దగ్గరకు వచ్చినా కాదనరు. జగన్ అలా కాదు. ఒకసారి దూరం పెడితే ఎప్పటికీ దూరమే. మరి మోహన్ బాబు ఇప్పుడు చంద్రబాబు దగ్గరకు వెళ్లారని తెలిసిన తరువాత జగన్ మరి దగ్గరకు తీయరు. చంద్రబాబుతో మంచు ఫ్యామిలీ ప్రయాణం మరోసారి ప్రారంభమైనట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?