Advertisement

Advertisement


Home > Politics - Analysis

చంద్రబాబుకు సవాలు ఇవే!

చంద్రబాబుకు సవాలు ఇవే!

మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. అప్పటి వరకు చంధ్రబాబు అనుకూల మీడియా ఏ విధంకా కథనాలు వండి వార్చినా అదంతా వేరే సంగతి. ఎన్నికల ముందు సీన్ వేరేగా వుంటుంది. అప్పటి వరకు ఈ కథనాలు అన్నీ కాలక్షేపానికి లేదంటే కాస్తో, కూస్తో అనుకూల వాతావరణం కల్పించడానికి మాత్రం పనికి వస్తాయి. కానీ ఎన్నికలు వచ్చిన తరువాత అసలు సిసలు సవాలు వుంటుంది జగన్ తో. అదెలా అన్నది చూద్దాం.

ప్రధానమైన సమస్య మేనిఫెస్టోతో వస్తుంది.

జగన్ అమలు పరుస్తున్న పథకాలు అన్నీ ఒక్కటి కూడా వదలకుండా అమలు చేస్తామని మాట ఇవ్వాల్సి వుంటుంది. ఇంకా మాట్లాడితే ఓ పదిశాతం అదనంగా లబ్ది పెంచాల్సి వుంటుంది. అలా చేయకపోతే అస్సలు మొదటికే మోసం వస్తుంది. కానీ ఇలా చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గతంలో తమ అనుకూల మీడియాలో రాయించుకున్న రాతలు అన్నీ ఇక్కడ అడ్డం పడతాయి. అప్పుల కూతలు అన్నీ గుర్తుకు వస్తాయి. సరే అవన్నీ కన్వీనియెంట్ గా మరిచిపోతారు..హామీలు ఇచ్చేస్తారు అనుకుందాం.

గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పాల్సి వుంటుంది. కావాలంటే వైకాపా వాళ్లను తీసేసి తేదేపా వాళ్లను పెడతామని చెప్పుకొవచ్చు. ఇక్కడ కూడా సమస్యే. తమ ఉద్యోగాలు పోతాయి బాబుగారు వస్తే అనుకుంటే లక్షలాది మంది గ్రామ వాలంటీర్లు, వారి కుటుంబాలు ఎటు మొగ్గుతాయి?

సరే, మేనిఫెస్టో ఏముంది ఎలా కావాలిస్తే అలా ఇవ్వ వచ్చు..నమ్మడం నమ్మకపోవడం జనం ఇష్టం అనుకుందా. కానీ టికెట్ ల కేటాయింపు కూడా సమస్యే.

జగన్ నిర్మొహమాటంగా బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు టికెట్ లు కుమ్మరిస్తారు. మహా అయితే రాయలసీమలో రెడ్లకు కాస్త పెద్ద పీట వేయచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ రివర్స్ లో చేయాల్సి వుంటుంది. రాయలసీమలో రెడ్ల మీద బిసి, ఎస్సీ, మైనారిటీలను నిలబెట్టుకోగలదు కానీ ఆంధ్రలోకి వచ్చేసరికి సమస్య అవుతుంది. ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి కాస్త గట్టిగానే సీట్లు ఇచ్చుకోవాల్సి వుంటుంది. అలాంటి ప్రతి చోటా జగన్ నిలబెట్టే బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పోటీ పడాల్సిందే. అలా కాకుండా చంద్రబాబు కూడా అదే బాట పడితే పార్టీకి కీలక మద్దతు దారులైన కమ్మ సామాజిక వర్గం నుంచి ఆర్థిక అండదండలు ఏమేరకు లభిస్తాయి అన్నది చూడాల్సి వుంటుంది. ఎందుకంటే టికెట్ ఆశించిన వారికి ఇవ్వకుండా, తమ సామాజిక వర్గంలోనే వేరే వారికి ఇస్తే సహించలేరు. అలాంటిది వేరే వర్గాలకు ఇస్తే పార్టీకి అండగా వుంటారా? అన్నది అనుమానం.

పార్టీ టికెట్ లు కేటాయించడంలో జగన్ పక్కా కఠినంగా వుంటారు. అస్సలు మొహమాటాలకు తలొగ్గరు. విజయావకాశాలు లేని వారికి నో అనడంలో ముందు వుంటారు. అవసరం లేని వారిని చటుక్కున వదిలేయగలరు. కానీ చంద్రబాబు అలా చేయలేరు. నాలుగు దశాబ్దాలుగా ఆయన వెన్నింటి వున్న వృద్ద తరాన్ని ఆయన అంత సులువుగా వదులుకోలేరు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి కాస్త విజయావకాశాలు వున్నాయనే విధంగా అనుకూల మీడియా వార్తలు రాస్తుండే సరికి పాత తరం నేతలు అంతా రెడీ అంటున్నారు.

ఎన్నికలకు బరిలో దింపేవారితో సమస్య ఇలా వుంటే అసలు సిసలు సమస్య మేనేజ్ మెంట్. ఎన్నికల మేనేజ్ మెంట్ అన్నది కీలకం. డబ్బులు గట్టిగా తీయాల్సిందే. అందులో ఎవరూ పతివ్రతలు కారు. కానీ అక్కడే అసలు సమస్య వుంది. జగన్ అభ్యర్థుల తరపున థర్డ్ పార్టీ ఖర్చు చేస్తుంది. ఖర్చు పక్కాగా వుండేలా చూస్తుంది. పైగా అభ్యర్థులు కూడా తీస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఇలాంటి వ్యవస్థను పెట్టుకోలేదు. ఇప్పుడు అలాంటి ఆలోచన చేయాల్సి వుంటుంది. పైగా ఆర్థికంగా స్థితిమంతులనే ఎంపిక చేయాల్సి వుంటుంది. ఎందుకంటే ఈసారి ఎన్నికలకు ఒక్కో పార్టీ కనీసం అయిదువేల కోట్లు ఖర్చు చేయాల్సి వుంటుంది. అది పార్టీ నుంచి కావచ్చు..అభ్యర్థులు కావచ్చు. మరే విధంగా అయినా కావచ్చు.

ఇంత ఖర్చును తెలుగుదేశం ఎలా తట్టుకుంటుంది అన్నది చూడాల్సి వుంది. ఇవన్నీ ఇలా వుంచితే ఇప్పటి వరకు జనసేన బంధం అధికారికంగానో, అనధికారికంగానో కొనసాగిస్తున్నారు. ఎన్నికల వేళ పక్కాగా క్లారిటీ ఇవ్వాల్సి వుంటుంది. అప్పుడు ఎలా వుంటుంది అన్నది చూడాలి. దాని వల్ల కొన్ని చోట్ల ప్లస్ కావచ్చు. మరి కొన్ని చోట్ల మైనస్ కావచ్చు. కానీ ఇక్కడ కూడా జగన్ ను సింగిల్ పాయింట్ నే. ఎప్పుడూ ఒకటే క్లారిటీ.

మొత్తం మీద ఎన్నికల తీరం వరకు ఒకలా వుంటుంది. ఎన్నికలు వచ్చాక మరోలా వుంటుంది. కానీ అప్పటికి ఇప్పటికి మారనిది ఒకటే వుంటుంది. అదే ఎల్లో మీడియా రాతలు. ఇప్పుడు జగన్ అంటే జనం ద్వేషిస్తున్నారు అని రాస్తున్నారు. అప్పుడు జగన్ అభ్యర్థులు ఎక్కడికక్కడ వెనుకంజలో వున్నారని రాస్తారు అంతే..తేడా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?