బాబు స్థాపించిన డొల్ల పార్టీ జ‌న‌సేన‌!

ప‌వ‌న్ జ‌న‌సేన గురించి సీరియ‌స్‌గా ఆలోచిస్తే ఆ పార్టీ పెట్టింది జ‌గ‌న్ కోసం అనిపిస్తుంది. ఎంత‌సేపూ జ‌గ‌న్‌ని ఓడించండి అన‌డం త‌ప్ప‌, తాము గెల‌వాల‌నే కోరిక ఏనాడూ లేదు. చంద్ర‌బాబుకి మొదటి నుంచి బినామి…

ప‌వ‌న్ జ‌న‌సేన గురించి సీరియ‌స్‌గా ఆలోచిస్తే ఆ పార్టీ పెట్టింది జ‌గ‌న్ కోసం అనిపిస్తుంది. ఎంత‌సేపూ జ‌గ‌న్‌ని ఓడించండి అన‌డం త‌ప్ప‌, తాము గెల‌వాల‌నే కోరిక ఏనాడూ లేదు. చంద్ర‌బాబుకి మొదటి నుంచి బినామి క‌ల్చ‌ర్ ఎక్కువ‌. రెండెక‌రాల రైతు నుంచి వేల కోట్ల‌కి ఎద‌గ‌డంలో బోలెడు బినామిలున్నారు. అయినా ఆయ‌న నిప్పు అని ఆంధ్ర‌జ్యోతి వాదిస్తుంది. బాబు జైలుకెళ్లిన‌ప్ప‌టి నుంచి రాధాకృష్ణ కాస్త బాధాకృష్ణ‌గా మారిపోయారు. డొల్ల కంపెనీల ద్వారా నిధులు తినేసే అల‌వాటున్న చంద్ర‌బాబు ప‌దేళ్ల క్రిత‌మే ప‌వ‌న్‌తో జ‌న‌సేన అనే డొల్ల పార్టీ పెట్టించాడనే అనుమానాలున్నాయి.

ఏ చారిత్ర‌క అవ‌స‌రం ప‌వ‌న్‌తో పార్టీ పెట్టించిందో ఆయ‌న‌కే తెలియాలి. పార్టీ పెట్టిన వాళ్లెవ‌రైనా తాము గెల‌వాల‌ని కోరుకుంటారు. ప‌వ‌న్ మాత్రం జ‌గ‌న్‌ని ఓడించండి, బాబుని గెలిపించండి అని అడిగాడు. బాబు గెలిచాడు. ఆ ఐదేళ్లు త‌న మిత్రుడు చంద్ర‌బాబు మెడ‌లు వంచి ప్ర‌జ‌ల కోసం ఏమైనా మంచిప‌నులు ప‌వ‌న్ చేయించాడా అదీ లేదు. మ‌రేం చేసాడు?  సినిమాలు చేసుకున్నాడు. 2019లో నేను కొమురం పులిని అంటూ దిగాడు. అప్పుడు కూడా అధికార ప‌క్షాన్ని తిట్ట‌డం మాని, జ‌గ‌న్‌ని ఓడించండి అన్నాడు. ప‌వ‌న్‌ని రెండు చోట్లా ఓడించారు.

ఓట‌మి గుణ‌పాఠంతో బుద్ధి తెచ్చుకుని ఈ నాలుగేళ్లు ప్ర‌జ‌ల మ‌ధ్య వున్నాడా అంటే అదీ లేదు. ఆయ‌న ఎపుడొచ్చినా జ‌నం బ్రహ్మ‌ర‌థం ప‌డ‌తారనే భ్రాంతి ఏదో వుంది. జ‌గ‌న్‌ని ఓడించ‌డానికి పొత్తు అంటున్నాడు, మంచిదే. అస‌లు జ‌న‌సేన సిద్ధాంతం ఏంటి?  టీడీపీకి మీకు మ‌ధ్య వున్న భావ‌సారూప్య‌త ఏంటి?  త‌లాతోకాలేని జ‌న‌సేన‌తో టీడీపీ అయిష్టంగానైనా ఎందుకు చేతులు క‌లుపుతూ వుందంటే మ‌ళ్లీ జ‌గ‌న్ గెలుస్తాడ‌నే భ‌యం. ముందు ఎలాగోలా అధికారంలోకి వ‌స్తే ప‌వ‌న్‌లాంటి ఎమోష‌న‌ల్ క్యారెక్ట‌ర్‌ని డీల్ చేయ‌డం బాబుకి చాలా సుల‌భం. 

గ‌తంలో హ‌రికృష్ణ‌కి ప‌ట్టిన గ‌తే ప‌వ‌న్‌కి కూడా. బాబు use and throw పాల‌సీ తెలిసే జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తున్నాడు.

40 ఏళ్ల తెలుగుదేశం పార్టీలో లోకేష్ త‌ప్ప ఇంకో లీడ‌ర్ ప్ర‌ముఖంగా లేని ప‌రిస్థితి. ఎందుకంటే కొడుకుని త‌ప్ప బాబు ఎవ‌ర్నీ ఎద‌గ‌నీయ‌డు. రేపు ప‌వ‌న్‌కి ప‌ళ్లెంలో పెట్టి అధికారంలో వాటా ఇచ్చేంత అమాయ‌కుడు కాదు. చివ‌రికి ప‌వ‌న్ ఎలా మిగిలిపోతాడంటే కంక‌ణానికి ఆశ‌ప‌డి ముస‌లి పులికి ఆహారంగా మారిన బాట‌సారిలా!