Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఆ విషయంలో పవన్ గొప్పోడా..? చిరంజీవి మంచోడా..?

ఆ విషయంలో పవన్ గొప్పోడా..? చిరంజీవి మంచోడా..?

ఏమాటకామాటే చెప్పుకోవాలి. చిరంజీవి ఇలా విడతలవారీగా తనని నమ్ముకున్నవాళ్లని మోసం చేయలేదు. ఒకేసారి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. 

అంతకు మించి జనాలను, తనని నమ్ముకున్న నాయకుల్ని మోసం చేయడం ఇష్టంలేక రాజకీయాలనుంచే తప్పుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ ఐదేళ్లకోసారి పార్టీని అద్దెకిస్తున్నారు. అంటే హోల్ సేల్ గా అమ్మేయడం కంటే ఇది దారుణం. 

ఇక్కడ ఓటర్లను, నాయకుల్ని నిత్యం మోసం చేస్తూనే ఉండాలి. పవన్ కల్యాణ్ చేస్తూనే ఉన్నారు కూడా.

ప్రజారాజ్యం నేతగా చిరు మంచోడే..

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆయన్ను నమ్మి చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. తమ విలువైన సమయాన్ని, ధనాన్ని, ఇమేజ్ ని ఆయన కోసం ఖర్చు పెట్టారు. కొంతమంది లాభం పొందారు, చాలామంది నష్టపోయారు. అయితే చిరంజీవి వెంటనే తన తప్పు తెలుసుకుని, పార్టీ మూసేసి, పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. 

భవిష్యత్తులో కూడా చిరు రాజకీయాల్లోకి రాకపోవచ్చు. ఎందుకంటే ఆయన జీవితకాలపు గుణపాఠం నేర్చుకున్నారు. తాను నష్టపోకూడదు, తనవల్ల ఎవరూ నష్టపోకూడదు అనుకుంటున్న చిరు, ఇతరులకు కూడా రాజకీయాల విషయంలో సలహాలివ్వరు, ప్రోత్సహించరు, అసలు ఆ జోలికే పోరు.

పవన్ సంగతేంటి..?

పవన్ కి రాజకీయాలంటే ఇష్టం. ప్రజా సేవకంటే ఆయనకు అధికారం అంటే బాగా ఇష్టం. అందుకే ప్రజారాజ్యం పోయినా, జనసేన పెట్టారు. అయితే అధికారం అంత ఈజీ కాదని తెలుసుకున్న పవన్.. పార్టీ పేరుతో అధికారం కాకపోయినా కనీసం ఆర్థిక అవసరాలైనా తీర్చుకుంటున్నారు. గెలిచే స్థానంలో టికెట్ కావాలా లేక అంతకు మించిన ఆర్థిక లాభం కావాలా అంటే.. పవన్ కల్యాణ్ తనకు రెండోదే కావాలి అనేంతగా మారిపోయారు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న రాజకీయం ఎలాంటిదో అందరికీ తెలుసు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయరు, ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తారు, ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా తనకు వచ్చే ఫలితాలను ఆయన బేరీజు వేసుకుంటారు. 

లేకపోతే.. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ వైసీపీ మినహా అన్ని పార్టీలతో చెలిమి చేశారు. జగన్ ఏపార్టీని దగ్గరకు రానీయరు కాబట్టి పవన్ పప్పులు అక్కడ ఉడకలేదు.

చిరంజీవి నమ్మినవారికి హితబోధ చేసి.. ముందు తాను ఊహాలోకం నుంచి బయటపడి, ఆ తర్వాత తనతోపాటు ఉన్నవారిని కూడా బయటకు తెచ్చి.. ఇప్పుడు తనపని తాను చూసుకుంటున్నారు. కానీ పవన్ కల్యాణ్ తనతోపాటు ఉన్నవారిని ఇంకా భ్రమల్లోనే బతికేలా చేస్తున్నారు. 

వాస్తవం తెలిసినా పాతికేళ్ల లక్ష్యం మనది అంటూ ఇంకా అందర్నీ మోసం చేస్తున్నారు. రాజకీయాల్లో చిరంజీవి అందరి మంచి కోరుకుంటే, పవన్ కల్యాణ్ మాత్రం తన మంచి కోసం అందరినీ బలిపీఠంపైకి ఎక్కిస్తున్నారు. అదే తేడా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?