చిరు నోరు విప్పాలేమో?

పవన్ కళ్యాణ్ మాటలు భలే చిత్రంగా వుంటాయి. ఏదేదో చెప్పేస్తుంటారు. అది తన చదువు గురించి కావచ్చు, తను పెరిగిన ఊళ్ల గురించి కావచ్చు. తన తండ్రి ఉద్యోగం గురించి కావచ్చు. ఏవీ నమ్మశక్యంగా…

పవన్ కళ్యాణ్ మాటలు భలే చిత్రంగా వుంటాయి. ఏదేదో చెప్పేస్తుంటారు. అది తన చదువు గురించి కావచ్చు, తను పెరిగిన ఊళ్ల గురించి కావచ్చు. తన తండ్రి ఉద్యోగం గురించి కావచ్చు. ఏవీ నమ్మశక్యంగా వుండవు. జనాలకు తెలిసినంత వరకు పవన్ తండ్రి వెంకట్రావు గారు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ . తరువాత ఎఎస్ఐ అయ్యారేమో తెలియదు. ఎక్కడెక్కడో పని చేసే వుంటారు. ప్రభుత్వ ఉద్యోగిగా. అది కామన్. కానీ పవన్ ఏదేదో చెబుతుంటారు.

నిన్నటికి నిన్న తన తండ్రి కమ్యూనిస్ట్ అని కొంత కాలం అజ్ఙాతంలో వున్నారని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అజ్ఙాతంలో వున్నది కేవలం నక్సలైట్లు మాత్రమే. ఎమర్జన్సీ టైమ్ లో కొంతమంది రాజకీయ నాయకులు. మరి పవన్ తండ్రి ఏ విధంగా అజ్ఙాతంలో వున్నట్లు? కమ్యూనిస్ట్ గా అజ్ఙాతవాసంలో వుండి వుంటే కానిస్టేబుల్ ఉద్యోగం ఎలా వచ్చినట్లు?

మామూలు కానిస్టేబుల్ గా వుంటూ ఎక్సైజ్ కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు అని మరో ముక్క చెప్పారు పవన్. మామూలుగా అయితే ఎక్సైజ్ కానిస్టేబుళ్లను అప్పట్లో నేరుగా కేవలం ఆ శాఖకే అపాయింట్ చేసుకునేవారు. వాళ్లకు పోలీస్ శాఖతో సంబంధం వుండదు. కానీ పవన్ చెబుతున్నది వేరుగా వుంది.

తన చదువు గురించి ఎలాగూ పవన్ క్లారిటీ ఇవ్వరు. కాసేపు సైన్స్ అంటారు. మరి కాసేపు హిస్టరీ అంటారు. కనీసం డిగ్రీ పాస్ కమ్మని తన తండ్రి పోరు పెట్టేవారు అంటారు. అంటే అంతే గొప్పగా వుండేదన్న మాట ఆయన చదువు.

అందువల్ల కనీసం తండ్రి ఉద్యోగం వివరాలు అయినా మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చేస్తే సరి. లేదూ అంటే మీటింగ్ మీటింగ్ కు ఏదో ఒకటి చెబుతూ పవన్ కళ్యాణ్ తన తండ్రి కెరీర్ మీద కూడా సందేహాలు రేకెత్తించేస్తారు.